Ott: ఓటీటీలోకి జ‌యం ర‌వి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. ఎప్ప‌టినుంచంటే!

ABN , Publish Date - Apr 13 , 2024 | 09:33 AM

జ‌యం ర‌వి ఇటీవ‌ల త‌మిళంలో న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

Ott: ఓటీటీలోకి జ‌యం ర‌వి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. ఎప్ప‌టినుంచంటే!
siren

తెలుగులో విజ‌యం సాధించిన చాలా సినిమాల‌ను త‌మిళంలో రిమేక్ చేస్తూ న‌టుడిగా గుర్తింపును తెచ్చుకుని ఇప్పుడు స్టార్‌గా ఎదిగిన న‌టుడు ర‌వి (Jayam Ravi). తెలుగువాడైన ర‌వి ఇక్క‌డ హిట్ అయిన నితిన్ జ‌యం సినిమాను అదే పేరుతో త‌మిళంలో రిమేక్ చేయ‌గా అక్క‌డా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయి సినిమా పేరే ఇంటి పేరుగా జ‌యం ర‌విగా (Jayam Ravi) స్థిర ప‌డిపోయాడు. ఆ సినిమా విజ‌యం త‌ర్వాత మ‌ళ్లీ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతున్నాడు.

jayam ravi9.jpg

త‌ను న‌టించిన త‌మిళ సినిమాలు ఎక్కువ‌గా టీవీల్లో తెలుగులో టెలికాస్ట్ అయి ఇక్క‌డి ప్రేక్ష‌కుల్లోనూ గుర్తింపును ద‌క్కించ‌కున్నాడు. ఈమ‌ధ్య పొన్నియ‌న్‌సెల్వ‌న్ 1, 2 చిత్రాల‌తో తెలుగు వారికి మ‌రింత‌గా ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న న‌టించిన సైరన్ (Siren) అనే త‌మిళ సినిమా ఫిభ్ర‌వ‌రి 16న‌ థియేట‌ర్ల‌లో విడుద‌లై మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. తెలుగులోను అదే స‌మ‌యంలో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగిపోయింది.మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

siren.jpg


ఏప్రిల్ 19 నుంచి తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో రూపొందిన ఈ చిత్రానికి అంథోని భాగ్యరాజ్ (Antony Bhagyaraj) దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) , అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్లుగా, స‌ముద్ర‌ఖ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.

sire.jpeg

క‌థ విష‌యానికి వ‌స్తే.. 14 సంవ‌త్స‌రాల జైలు శిక్ష అనుభ‌విస్తూ 14 రోజుల‌ పెరోల్‌పై బ‌య‌ట‌కి వ‌చ్చి త‌న కూతురిని చూడాల‌నుకునే ఒ అంబులెన్స్ డ్రైవ‌ర్ చూట్టూ క‌థ సాగుతుంది. అత‌ను బ‌య‌ట‌కు వ‌చ్చాక అత‌ని కేసులో సంబంధం ఉన్న వారి మ‌ర్డ‌ర్స్ జ‌రుగుతాయి. దీంతో కేసును ఇన్వెస్టిగేష‌న్ చేసేందుకు ఓ హీరోయిన్ రంగంలోకి దిగుతుంది. త‌ర్వాత ఏం జ‌రిగింది, హీరో జైలుకు ఎందుకు వెళ్లాడు, కూతురు ఎందుకు ఒంట‌రి అయింద‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సాగుతుంది.


ఇవి కూడా చదవండి:

========================

Ruhani Sharma: రుహానీ శ‌ర్మ‌.. మ‌రీ ఇంత ప‌చ్చిగానా! అది సినిమానా లేక‌ బ్లూ ఫిల్మా?

********************************

Mamitha Baiju: మ‌మితా బైజు.. కుర్ర‌కారుకు ఎందుకింత‌ మోజు

************************************

OTT: ఓటీటీలో.. స్ట్రీమవుతున్న‌ అదిరిపోయే క్రైమ్ ఇన్వెష్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్‌! డోంట్ మిస్‌

Updated Date - Apr 13 , 2024 | 09:37 AM