Sasidavane: ఈ సినిమా లెక్క వేరే.. టీజర్ చూస్తుంటే తెలియడంలా..

ABN , Publish Date - Jan 03 , 2024 | 08:09 PM

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్. స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Sasidavane: ఈ సినిమా లెక్క వేరే.. టీజర్ చూస్తుంటే తెలియడంలా..
Sasidavane Movie Poster

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి (Rakshit Atluri), కోమలీ (Komalee) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’ (Sasidavane). గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్. స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన (SaiMohan Ubbana) దర్శకత్వం వ‌హిస్తున్నారు. చిత్రీకరణను ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథలా ఈ సినిమా ఉంటుందనేది ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.

టీజర్‌ను గమనిస్తే.. హీరో (రక్షిత్ అట్లూరి), హీరోయిన్ (కోమలీ) కోసం ఆమె ఇంటి దగ్గర వెయిట్ చేయటం, ఆమె కనపడకపోవటంతో ఆమెకు డిఫరెంట్‌గా సిగ్నల్ పంపటం సన్నివేశాలు వైవిధ్యంగా ఉన్నాయి. అలాగే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. ఇక ఈ టీజర్ ఎండింగ్‌లో హీరో రక్షిత్ లుక్ చూస్తుంటే కథలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. అదేంటనేది మాత్రం తెలియకుండా దర్శక నిర్మాతలు సీక్రెట్‌ను మెయింటైన్ చేయటం చూస్తుంటే సినిమాలో హై మూమెంట్ ఏదో ఉందనే ఆసక్తిని అయితే ఈ టీజర్ కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Sasidavane Teaser Out)


Rakshit.jpg

ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన టైటిల్ సాంగ్ ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్స్‌ మంచి స్పందనను రాబట్టుకున్నాయని, ఇప్పుడు విడుదలైన టీజర్ ఈ అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళుతుందని నిర్మాతలు చెబుతున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ చిత్ర ట్రైలర్, విడుదల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వారు తెలిపారు. శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Sriya Reddy: అమ్మతోడు.. ‘పీఎస్‌’ స్టోరీ అర్థం కాలేదు

****************************

*Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి దర్శనం ఇలా..

*****************************

*BSS10: బెల్లంకొండ శ్రీనివాస్, సాగర్ కె చంద్ర కాంబో చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్.. గ్లింప్స్ చూశారా?

**************************

*HanuMan: ‘హను-మాన్’ ‘శ్రీ రామధూత స్తోత్రం’.. ఇది వేరే లెవల్

****************************

Updated Date - Jan 03 , 2024 | 08:09 PM