scorecardresearch

Jai Hanuman: హ‌నుమాన్ పైకి డ్రాగ‌న్‌.. ప్ర‌శాంత్ వ‌ర్మ అస‌లు ఏం ఫ్లాన్ చేస్తున్నావ్ సామీ

ABN , Publish Date - Apr 23 , 2024 | 05:26 PM

హ‌నుమాన్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత ప్ర‌శాంత్ సినిమాటిక్‌ యూనివ‌ర్స్ లో త‌దుప‌రి వ‌స్తోన్న చిత్రం జై హ‌నుమాన్ . ఈ రోజు హ‌నుమ జ‌యంతి సంద‌ర్బంగా ఓ కొత్త పోస్టర్‌ను విడుద‌ల చేశారు.

Jai Hanuman: హ‌నుమాన్ పైకి డ్రాగ‌న్‌.. ప్ర‌శాంత్ వ‌ర్మ అస‌లు ఏం ఫ్లాన్ చేస్తున్నావ్ సామీ
jai hanuman

హ‌నుమాన్ (Hanuman) వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత క్రియేటివ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ సినిమాటిక్‌ యూనివ‌ర్స్ (PVCU) లో భాగంగా త‌దుప‌రి వ‌స్తోన్న చిత్రం జై హ‌నుమాన్ (Jai Hanuman). ఇప్ప‌టికే ఈ చిత్రం షూటింగ్ మొద‌ల‌యింది. అయితే ఈ రోజుతో హ‌నుమాన్ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకోవ‌డంతో పాటు (ఏప్రిల్ 23 మంగ‌ళ‌వారం) హ‌నుమ జ‌యంతి పండ‌గ కూడా క‌లిసి రావ‌డంతో జై హ‌నుమాన్ చిత్రంకు సంబంధించి ఓ కొత్త పోస్టర్‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ (Prasanth Varma) విడుద‌ల చేశారు. ఇప్పుడు ఈ పోస్ట‌ర్ సామాజిక మాధ్య‌మాల్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

hanuman.jpeg


ఈ పోస్టర్‌లో లార్డ్ హనుమాన్ కొండపై చేతిలో గదతో నిలబడి ఉండ‌గా.. ఓ డ్రాగన్ హనుమపైకి అగ్నిని విర‌జిమ్ముతూ వ‌స్తూ ఉండ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇదిలాఉండ‌గా ఈ సినిమాతో డ్రాగన్‌లను తొలిసారిగా ఇండియన్ స్క్రీన్‌పైకి తీసుకొస్తుడ‌డం విశేషం. అంతేగాక ఈ జై హనుమాన్ చిత్రాన్ని IMAX 3Dలో విడుదల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో సినిమాపై రోజురోజుకు ప్రేక్ష‌కుల్లో కొత్త అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. అయితే ఈ జై హ‌నుమాన్ (Jai Hanuman) మూవీలో న‌టిస్తోన్న వారి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Apr 23 , 2024 | 05:57 PM