Avantika Vandanapu: మ‌నం చూస్తున్న‌ది నిజ‌మేనా.. ఈ అమ్మాయిని గుర్తు ప‌ట్టారా?

ABN , Publish Date - Jan 14 , 2024 | 08:39 PM

అవును చూస్తున్న‌ది నిజ‌మేనా అని అనిపిస్తుంది ఈ ఫొటో చూస్తే. ఓ ద‌శ‌లో మ‌న కండ్ల‌ను కూడా మ‌నం న‌మ్మ‌లేం ఈ వీడియోను చూస్తే. ఇంత‌లో ఎంత మార్పు అన‌కుండా ఉండ‌లేం. అస‌లేం జ‌రుగుతుంది ఇక్క‌డా అని మ‌నం అనుకోక తప్ప‌దు.

Avantika Vandanapu: మ‌నం చూస్తున్న‌ది నిజ‌మేనా.. ఈ అమ్మాయిని గుర్తు ప‌ట్టారా?
avanthika

అవును అస‌లు మ‌నం చూస్తున్న‌ది నిజ‌మేనా అని అనిపిస్తుంది ఈ ఫొటో చూస్తే. ఓ ద‌శ‌లో మ‌న కండ్ల‌ను కూడా మ‌నం న‌మ్మ‌లేం ఆ వీడియోను చూస్తే. ఇంత‌లో ఎంత మార్పు అన‌కుండా ఉండ‌లేం. అస‌లేం జ‌రుగుతుంది ఇక్క‌డా అని మ‌నం అనుకోక తప్ప‌దు. 2016లో మ‌హేశ్‌బాబు హీరోగా వ‌చ్చిన బ్రహ్మోత్స‌వం సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్న అవంతిక వంద‌న‌పు (Avantika Vandanapu) ఆ త‌ర్వాత వ‌రుస‌బెట్టి ప్రేమం, రారండోయ్ వేడుక చూద్దాం, అజ్ఞాత‌వాసి, మ‌న‌మంతా, సినిమాల్లో న‌టించింది. ముఖ్యంగా అవంతిక చేసిన పార్చూన్ అయిల్ యాడ్ అయితే ఇంకా చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. ‘శృతి ఇప్పుడు అంత తింటున్నావ్ అంటే.. అమ్మ చేసింది మిస్ లైట్‌గానే ఉంటుంది’ అనే సాగే ఈ యాడ్ ఇప్ప‌టికీ చాలామందికి ఓ మెమ‌రీ కూడా.

avan.jpeg

అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలో నివాస‌ముండే ఓ హైద‌రాబాదీ తెలుగు ఫ్యామిలీలో జ‌న్మించిన అవంతిక (Avantika Vandanapu) బాల్యం తెలంగాణ‌లో గ‌డిచింది. చిన్న‌ప్ప‌టి నుంచే కూచిపూడి , భ‌ర‌త నాట్యాల‌లో శిక్ష‌ణ పొందింది. అనంత‌రం జీ తెలుగు నార్త్ అమెరికాలో నిర్వ‌హించిన రియాలిటీ షో డాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ స్టార్స్‌లో రెండో బ‌హుమ‌తి సాధించింది. అటు పిమ్మ‌ట తెలుగు సినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో చివ‌ర‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ అజ్ఞ‌త‌వాసి తెలుగు సినిమాలో న‌టించింది. ఆపై హాలీవుడ్ సిరీస్‌లలో న‌టిస్తూ ఇప్పుడిప్పుడే అక్క‌డా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అవంతిక డిస్నీ స్టూడియోస్‌లో రెండు సిరీస్‌లో న‌టించ‌గా 2022లో సీనియ‌ర్ ఇయ‌ర్‌, 2024లో మీన్ గ‌ర్ల్స్‌, హోరో స్కోప్ సినిమాల్లో న‌టించింది.


అయితే ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అమెరిక‌న్ టీన్‌, మ్యూజిక‌ల్, కామెడీ చిత్రం మీన్‌గ‌ర్ల్స్ (Mean Girls) ఇప్పుడు వార్త‌ల్లో నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సోష‌ల్ మీడియాను బాగా షేక్ చేస్తున్న‌ది. ఎందుకంటే ఇందులో అవంతిక (క‌రేన్ శెట్టి) పాత్ర‌లో న‌టిస్తుండ‌గా ఈమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కు రావ‌డంతో జ‌నాలు నోరెళ్లబెడుతున్నారు.

GDvdomFbEAANz9n.jpeg

మొద‌ట అమెను చాలామంది గుర్తించ‌క‌పోయిన త‌ర్వాత తెలుసుకుని నిశ్చేష్టుల‌వుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా ఆ వీడియోలు ఉన్నాయి. మ‌నం చూస్తున్న‌ది నిజ‌మేనా.. ఇ అమ్మాయేనా మ‌హేశ్‌బాబుతో చేసింది, ఆ ఆయిల్ యాడ్ చేసిందంటూ చ‌ర్చించుకుంటున్నారు. మున్ముందు ఇంకా ఎన్ని ,ఎవ‌రెవ‌రిని చూడాల్సి వ‌స్తుందోన‌ని బాహాటంగానే అంటున్నారు. మీరూ ఇంత వ‌ర‌కు చూడ‌లేదా ఇప్పుడు చూసేయండి.

Updated Date - Jan 14 , 2024 | 08:57 PM