Kajal Aggarwal: స‌మంత బాట‌లోనే కాజ‌ల్‌.. విష‌య‌మేంటంటే!

ABN , Publish Date - Apr 23 , 2024 | 04:32 PM

కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు ఓ విష‌యంలో స‌మంతను ప‌క్కాగా ఫాలో అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

Kajal Aggarwal: స‌మంత బాట‌లోనే కాజ‌ల్‌.. విష‌య‌మేంటంటే!
kajal samantha

కాజ‌ల్ అగ‌ర్వాల్ (Kajal Aggarwal) సౌత్ ఇండియా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. 2007లో తేజ‌ ల‌క్ష్మీ క‌ళ్యాణం చిత్రంతో మొద‌లు పెట్టి తాజాగా స‌త్య‌భామ చిత్రం వ‌ర‌కు వ‌రుసగా చిత్రాలు చేస్తూ గ‌డిచిన‌ 17 సంవ‌త్స‌రాలుగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ వ‌స్తోంది.

kajalagarwalsatyabhama.jpg

2020లో పెళ్లి త‌ర్వాత సినిమాల‌ను త‌గ్గించుకున్న ఈ సుంద‌రి గ‌తేడాది తెలుగులో భ‌గ‌వంత్ కేస‌రితో మ‌రోసారి రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టగా ప్ర‌స్తుతం స‌త్య‌భామ (Satyabhama) అనే స్ట్రెయిట్ తెలుగు సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుండ‌గా, ఇండియ‌న్ 2తో పాటు ఓ హిందీ చిత్రం కాజ‌ల్ (Kajal Aggarwal) చేతిలో ఉన్నాయి.

kajal  8.jpeg

అయితే.. నేడు సౌత్‌లో యువ హీరోయిన్ల హ‌వా పెర‌గ‌డంతో వారి నుంచి పోటీనీ త‌ట్టుకునేందుకు, మ‌రిన్ని సినిమా ఆఫ‌ర్ల కోసం కాజ‌ల్ అగ‌ర్వాల్ (Kajal Aggarwal) మ‌రో న‌టి స‌మంత (Samantha)ను ప‌క్కాగా ఫాలో అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

samantha.jpeg

విడాకులు, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో సినిమాలకు కొంత‌కాలం దూరంగా ఉన్న స‌మంత (Samantha) ఈ మ‌ధ్య విహార‌యాత్ర‌లు, ప్ర‌మోష‌న్స్ అంటూ ఎన్న‌డు లేని విధంగా వేసుకునే బ‌ట్ట‌ల విష‌యంలో చాలా పొదుపు పాటిస్తూ వ‌స్తోంది.

F-j74KAagAAo_cT.jpeg

అంతేగాక వెకేష‌న్ల‌కు వెళ్లిన‌ప్పుడు ఎలాంటి మోహ‌మాటం లేకుండా బికినీ ఫొటోల‌ను , వీడియోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తు అభిమానుల‌ను, నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటూ ఇంకా నేను యాక్టివ్‌గానే ఉన్నాన‌నేలా హింట్స్ ఇస్తోంది.

samantha 3.jpeg


అదేవ‌రుస‌లో.... ఇప్పుడు కాజ‌ల్ ఆగ‌ర్వాల్ (Kajal Aggarwal) కూడా స‌మంత బాట‌నే ఎంచుకుని నేను ఫీల్ట్‌లోనే ఉన్నా అనేలా తాజాగా తాను షేర్ చేసిన ఫొటోల‌ను చూస్తే ఇట్టే అర్ధ‌మవుతోంది.

kajal 6.jpeg

పెళ్లై.. కుమారుడున్నా ఎలాంటి మొహ‌మాటం లేకుండా కాజ‌ల్ రీసెంట్‌గా చేసిన‌ ఫొటోషూట్ చిత్రాలను సామాజిక మాధ్య‌మాల్లో పంచుకోవ‌డంతో అవి నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

kajal  4.jpeg

ఆ ఫొటోల్లో కాజ‌ల్ (Kajal Aggarwal)ను చూసి అభిమానులు ఒక్క సారిగా షాక‌వుత‌న్నారు. ఇప్పుడు ఇలాంటిషూట్లు అవ‌స‌ర‌మా అని కొంత‌మంది విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా మ‌రికొంత‌మంది వాటిని ఆస్వాదిస్తున్నారు.

kajal 3.jpeg

అంతేగాక కాజ‌ల్ కూడా స‌మంత (Samantha) బాట‌లోనే ప‌య‌నిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు ఆ చిత్రాల‌ను ఓ సారి చూసేయండి.. ఆల‌స్య‌మెందుకు.

Updated Date - Apr 23 , 2024 | 04:39 PM