Prabhas: ఏమున్నాడురా బాబు.. అనుష్కను గుర్తు చేస్తున్నారుగా!

ABN , Publish Date - Apr 24 , 2024 | 10:15 AM

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఏం చేసినా, ఆయ‌న‌కు సంబంధించి ఎలాంటి వార్త వ‌చ్చిన క్ష‌ణాల్లో ట్రెండింగ్‌లోకి వ‌చ్చేస్తోంది.

 Prabhas: ఏమున్నాడురా బాబు.. అనుష్కను గుర్తు చేస్తున్నారుగా!
prabhas

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) ఏం చేసినా, ఆయ‌న‌కు సంబంధించి ఎలాంటి వార్త వ‌చ్చిన క్ష‌ణాల్లో ట్రెండింగ్‌లోకి వ‌చ్చేస్తోంది. రెండు రోజుల క్రితం ద‌ర్శ‌కుల సంఘానికి రూ. 35 ల‌క్ష‌లు విరాళంగా ఇవ్వ‌డం పెద్ద హాట టాపిక్‌గా మార‌గా సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌భాస్‌ను, ఆయ‌న సేవా గుణాన్ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. అది మ‌ర‌వ‌క ముందే బుధ‌వారం ప్ర‌భాస్ (Prabhas) లెటెస్ట్ లుక్ ఇదే అంటూ నెట్టింట ఓ ఫొటో బాగా హ‌ల్‌చ్ చేస్తోంది. అయితే ఈ చిత్రం క‌ల్కీ (Kalki 2898AD) సినిమాలోదా లేకుంటే Aiలో చేసిన స్టిల్ అనేది తెలియాల్సి ఉంది.

prabhass.jpeg


ఇటీవ‌ల బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా క‌ల్కీ (Kalki 2898AD) సినిమాలో త‌ను పోషించిన అశ్వ‌థ్ధామ గ్లిమ్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేయ‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి అటెన్ష‌న్ తీసుకువ‌చ్చింది. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కే ప్ర‌భాస్ (Prabhas) న‌యా అవ‌తార్ అంటూ ఈ ఫొటో బ‌య‌ట‌కు రావ‌డంతో అభిమానుల‌తో పాటు నెటిజ‌న్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఏమున్నాడురా బాబు అంటూ మిర్చి సినిమాలో అనుష్క చెప్పే డైలాగ్‌ను వాడుతున్నారు. ఈ లుక్‌లో ప్ర‌భాస్ సూప‌ర్‌గా ఉన్నాబ‌ని, హాలీవుడ్ స్టార్లి మించి ఉన్నాడంటూ అదేప‌నిగా ట్వీట్లు చేస్తున్నారు. మీరు ఇంత వ‌ర‌కు చూడ‌లేదా ఇప్పుడే చూసేయండి మ‌రి.

Updated Date - Apr 24 , 2024 | 10:30 AM