కలసి నటించాలని ఎదురుచూస్తున్నా...

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:22 AM

‘వార్‌-2’ చిత్రంతో ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఎన్టీఆర్‌ ముంబయి వెళ్లారు...

కలసి నటించాలని ఎదురుచూస్తున్నా...

‘వార్‌-2’ చిత్రంతో ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఎన్టీఆర్‌ ముంబయి వెళ్లారు. తాజాగా, నటి ఊర్వశీ రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తారక్‌తో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుని.. ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ‘‘ఎన్టీఆర్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ఎంతో క్రమశిక్షణ, వినమ్రత, నిజాయితీ, ముక్కుసూటితనం కలిగిన వ్యక్తి. భవిష్యత్తులో ఎన్టీఆర్‌తో కలసి నటించాలని ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 03:24 AM