Bobby Deol: హంట‌ర్ ఎంట‌ర‌య్యాడు.. NBK109లోకి బాబీడియోల్ ఎంట్రీ

ABN , Publish Date - Apr 24 , 2024 | 06:53 AM

వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత బాబీ ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం బాలకృష్ణ న‌టిస్తోన్న‌ NBK109. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో బాబీ డియోల్ జాయిన్ అయ్యారు.

Bobby Deol: హంట‌ర్ ఎంట‌ర‌య్యాడు.. NBK109లోకి బాబీడియోల్ ఎంట్రీ
nbk109

వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత బాబీ (Bobby) ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) న‌టిస్తోన్న‌ NBK109. ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా మేక‌ర్స్ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అప్టేట్ ఇచ్చారు.

balakrishna.jpeg

ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తోన్న బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ (Bobby Deol) షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ సంద‌ర్భంగా హంట‌ర్ ఎంట‌ర‌య్యాడు.. మీ చేరిక‌తో మా సినిమాకు మ‌రింత బ‌లం చేకూరిందంటూ ద‌ర్శ‌కుడు బాబీ (Bobby) నిర్మాత నాగ‌వంశీ (Naga Vamsi) బాబీ డియోల్‌కు స్వాగ‌తం ప‌లికిన‌ ఫొటోను త‌మ సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేశారు.

baby.jpeg


అవుట్ అండ్ ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి, టాలీవుడ్ సెన్షేష‌న్ ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా చాందినీ చౌదరి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments), ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా (Fortune Four Cinemas) బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి (Naga Vamsi), సాయి సౌజన్య (Sai Soujanya) సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 06:53 AM