Indian 2: ‘ఇండియన్‌-2’ విడుదల ఎప్పుడు?

ABN , Publish Date - Jan 03 , 2024 | 09:50 PM

విశ్వనటుడు కమలహాసన్‌ - సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇండియన్‌-2’ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ లేకపోవడంతో ప్రేక్షకులతో పాటు కమల్‌ అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. సాలిగ్రామంలోని ప్రసాద్‌ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో ఈ చిత్రం టాకీపార్ట్‌ మొత్తం షూటింగ్‌ పూర్తిచేశారు. కేవలం రెండు పాటలు మాత్రమే మిగిలివున్నాయి. అయితే, ఈ చిత్రం విడుదల ఎప్పుడన్నది చర్చనీయాంశంగా మారింది.

Indian 2: ‘ఇండియన్‌-2’ విడుదల ఎప్పుడు?
Indian 2 Movie Poster

విశ్వనటుడు కమల్ హాసన్‌ (Kamal Haasan) - సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ (Director Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇండియన్‌-2’ (Indian 2) చిత్రం విడుదల తేదీపై క్లారిటీ లేకపోవడంతో ప్రేక్షకులతో పాటు కమల్‌ అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. సాలిగ్రామంలోని ప్రసాద్‌ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో ఈ చిత్రం టాకీపార్ట్‌ మొత్తం షూటింగ్‌ పూర్తిచేశారు. కేవలం రెండు పాటలు మాత్రమే మిగిలివున్నాయి. అయితే, ఈ చిత్రం విడుదల ఎప్పుడన్నది చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్‌ వర్గాల మేరకు ఈ సినిమా వేసవి సెలవులు లేదా దీపావళికి విడుదల చేసే అవకాశం ఉందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మరికొన్ని నెలలకు ‘ఇండియన్‌-3’ (Indian 3) సినిమా విడుదలకావొచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ఇండియన్ 2’తో పాటు 3కి సంబంధించిన షూటింగ్ కూడా శంకర్ పూర్తి చేస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


Indian-2.jpg

లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌, రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ఎస్‌జే సూర్య, బాబీసింహా, వివేక్‌, ప్రియా భవానీ శంకర్‌, బ్రహ్మానందం, సముద్రగని, నెడుముడి వేణు ఇతర పాత్రలను పోషించారు. రవివర్మన్‌ సినిమాటోగ్రఫీ అందించగా అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. 1996లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఇండియన్‌’కు ఇది సీక్వెల్‌. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కొన్ని పరిస్థితుల కారణంగా.. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కోర్టు గొడవల అనంతరం.. శంకర్ మళ్లీ ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లి.. షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. (Indian 2 Movie Release Date)


ఇవి కూడా చదవండి:

====================

*Sriya Reddy: అమ్మతోడు.. ‘పీఎస్‌’ స్టోరీ అర్థం కాలేదు

****************************

*Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి దర్శనం ఇలా..

*****************************

*BSS10: బెల్లంకొండ శ్రీనివాస్, సాగర్ కె చంద్ర కాంబో చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్.. గ్లింప్స్ చూశారా?

**************************

*HanuMan: ‘హను-మాన్’ ‘శ్రీ రామధూత స్తోత్రం’.. ఇది వేరే లెవల్

****************************

Updated Date - Jan 03 , 2024 | 09:50 PM