Vijay Sethupathi: సత్యరాజ్‌కు ధీటుగా నటించాలని ఉంది

ABN , Publish Date - Jan 20 , 2024 | 03:21 PM

నటనలో పోటీపడుతూ, రెండు పాత్రలు సమాన స్థాయిలో ఉండేలా నటుడు సత్యరాజ్‌కు దీటుగా ఒక చిత్రంలో నటించాలన్నదే తన కోరిక అని ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి అన్నారు. ఆర్‌జే బాలాజీ, మీనాక్షి చౌదరి జంటగా.. సత్యరాజ్‌ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘సింగపూర్‌ సెలూన్‌’. ఈ నెల 25న విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని, ట్రైలర్‌ విడుదల వేడుక‌ను చెన్నైలో నిర్వహించారు.

Vijay Sethupathi: సత్యరాజ్‌కు ధీటుగా నటించాలని ఉంది
Vijay Sethupathi and Sathyaraj

నటనలో పోటీపడుతూ, రెండు పాత్రలు సమాన స్థాయిలో ఉండేలా నటుడు సత్యరాజ్‌ (Sathyaraj)కు దీటుగా ఒక చిత్రంలో నటించాలన్నదే తన కోరిక అని ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) అన్నారు. ఆర్‌జే బాలాజీ (RJ Balaji), మీనాక్షి చౌదరి (Meenakshii Chaudhary) జంటగా.. సత్యరాజ్‌ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘సింగపూర్‌ సెలూన్‌’ (Singapore Saloon). ఈ నెల 25న విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని, ట్రైలర్‌ విడుదల వేడుక‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ... ఈ సినిమా టైటిల్‌ ఎంతగానో బాగుంది. ఒక టీవీ చానెల్‌ లోగో తరహాలో ఉంది. ఆర్జే బాలాజీని స్ర్కీన్‌పై చూస్తుంటే చాలా బాగుంటుంది. నటనలో సత్యరాజ్‌ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. ఆయనతో కలిసి సమానమైన పాత్రలలో నటించాలని ఉంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు. చిత్ర నిర్మాత ఐసరి కె.గణేశ్‌ మాట్లాడుతూ... ‘నటుడు విజయ్‌ సేతుపతి కోరికను నెరవేర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇద్దరు హీరోలు నటించేలా కథలు ఉంటే చెప్పాలని చిత్ర దర్శకుడు గోకుల్‌ను కోరా. కథ సిద్ధంగా ఉంది. విజయ్‌ సేతుపతి, సత్యరాజ్‌తో కలిసి సినిమా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని ప్రకటించారు. (Singapore Saloon Trailer Launch Event)


Vijay.jpg

హీరో ఆర్జే బాలాజీ మాట్లాడుతూ... ‘ఈ చిత్రాన్ని చూసిన మంత్రి ఉదయనిధి కథ నచ్చడంతో విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు. అంతేకానీ, ఆయన, నేను బంధువులం కాదు. రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ కేవలం కంటెంట్‌ ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుని విడుదల చేస్తుంది. అలా మా చిత్రాన్ని ఎంపిక చేసింది. ఇంజనీరింగ్‌ అనేది ఒక కులవృత్తి కాదు. ఎవరైనా చేయవచ్చు. యువత ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత తమకు నచ్చిన రంగంలో రాణించాలని చెప్పేదే ఈ చిత్ర సారాంశం’ అని అన్నారు. దర్శకుడు గోకుల్‌ మాట్లాడుతూ... ‘నేను రూపొందించిన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే నాకు ఈ చిత్రం ప్రత్యేకం’ అని అన్నారు. కాగా, వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానరుపై నిర్మించిన ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ జావెద్‌ రియాజ్‌, సంగీతం వివేక్‌ - మెర్విన్‌ అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Varun Tej: మెగా ప్రిన్స్ బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్.. ఎలా ఉందంటే?

**************************

*Hansika: 34 నిమిషాల షాట్‌ని సింగిల్ టేక్‌లో..

***************************

*Nayanthara: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణలు చెప్పిన నయనతార

****************************

Updated Date - Jan 20 , 2024 | 03:21 PM