Nayanthara: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణలు చెప్పిన నయనతార

ABN , Publish Date - Jan 19 , 2024 | 11:38 AM

నయనతార 75వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కోలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘అన్నపూరణి’. ‘ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనేది ఈ సినిమా ట్యాగ్‌‌లైన్‌. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. చెఫ్‌గా ఎదగాలనే తన కలను ఎలా సాకారం చేసుకుంది? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా ఎటువంటి కాంట్రవర్సీ నడుస్తుందో తెలియంది కాదు. ఈ కాంట్రవర్సీపై స్పందించిన నయనతార అందరినీ క్షమాపణలు కోరింది.

Nayanthara: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణలు చెప్పిన నయనతార
Nayanthara

నయనతార 75వ చిత్రం (Nayanthara 7th Film)గా ఎంతో ప్రతిష్టాత్మకంగా కోలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). ‘ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనేది ఈ సినిమా ట్యాగ్‌‌లైన్‌. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయి.. చెఫ్‌గా ఎదగాలనే తన కలను ఎలా సాకారం చేసుకుంది? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా ఎటువంటి కాంట్రవర్సీ నడుస్తుందో తెలియంది కాదు. థియేటర్లలో విడుదలైనప్పుడు అంత పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ.. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత మాత్రం ఈ సినిమాపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులోని సన్నివేశాలు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే ఈ సినిమాని ఓటీటీ నుండి తొలగించాలని డిమాండ్స్ రావడంతో.. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ సంస్థ ఈ సినిమాని ఓటీటీ నుండి తొలగించింది. తాజాగా ఈ సినిమాని ఓటీటీ నుండి తొలగించడంపై, అలాగే జరిగిన కాంట్రవర్సీపై నయనతార ఓ లేఖను విడుదల చేసింది. ఇందులో ఆమె ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించాలని కోరింది. (Annapoorani Controversy)


Nayan.jpg

‘‘బరువెక్కిన హృదయంతో ఈ లేఖను రాస్తున్నా. ప్రజల్లోకి ఒక మంచి ఆలోచనను రేకెత్తించాలనే ఒక గొప్ప సంకల్పంతో ‘అన్నపూరణి’ సినిమాను రూపొందించాం. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలియజేయాలనే ఈ సినిమా చేశాం. అందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాకు తెలియకుండానే కొందరి మనసుల్ని గాయపరిచాం. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చిన సినిమాను, థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడిన సినిమాను ఓటీటీ వేదిక నుంచి తొలగిస్తారని అస్సలు ఊహించలేదు. మా చిత్రబృందం కానీ, నేను కానీ ఈ సినిమాతో ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదు. నేను ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం మాత్రం కాదని.. దేవుడ్ని నమ్ముతూ, నిత్యం గుడిలో పూజలు చేసే వారందరికీ ఈ సందర్భంగా చెబుతున్నాను. ఈ సినిమాతో మీ మనోభావాలను గాయపరిచినందుకు హృదయ పూర్వకంగా క్షమించమని అడుగుతున్నాను. ఈ చిత్ర ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాలనే కానీ.. ఎవరినీ కించపరచడం కాదు. నా 20 ఏళ్ల సినీ జర్నీ ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే. పాజిటివిటీని అందరికీ వ్యాప్తిచేయడమే.. జై శ్రీరామ్’’ అని నయనతార ఈ లేఖలో పేర్కొన్నారు. (Nayanthara Apology Letter on Annapoorani Controversy)

నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ ‘అన్నపూరణి’ (Annapoorani) సినిమా నీలేశ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. జై, సత్యరాజ్ వంటి వారు ఇతర పాత్రలలో నటించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతికి మొగల్తూరులో ఏం చేస్తున్నారంటే..

****************************

*Guntur Kaaram: ‘కుర్చీ మడతపెట్టి’ పాట.. నిజంగానే మడతపెట్టేస్తోంది

*****************************

*Sundeep Kishan: ‘ఈగల్‌’ రిలీజ్‌ డేట్‌ విషయంలో మాకు ఎలాంటి కాల్స్ రాలేదు

*********************************

*NTR: ఎన్టీఆర్‌కు హాలీవుడ్, బాలీవుడ్ అవకాశాలు వచ్చినా తిరస్కరించారు.. ఎందుకంటే?

*******************************

Updated Date - Jan 19 , 2024 | 11:40 AM