Varun Tej: మెగా ప్రిన్స్ బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్.. ఎలా ఉందంటే?

ABN , Publish Date - Jan 19 , 2024 | 04:27 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా.. ‘పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో వరుణ్ తేజ్ బర్త్‌డేని పురస్కరించుకుని శుక్రవారం ఈ సినిమా నుండి ఓపెన్ బ్రాకెట్ పేరుతో ఓ వీడియోని వదిలారు.

Varun Tej: మెగా ప్రిన్స్ బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్.. ఎలా ఉందంటే?
Varun Tej in Matka

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) హీరోగా.. ‘పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్’ ఫేమ్ కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’ (Matka). వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌‌లో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతోంది. ‘మట్కా’ హై బడ్జెట్, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో బిగ్ కాన్వాస్‌పై రూపొందుతోంది. శుక్రవారం (జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. మట్కా ప్రిమైజ్‌ని చూపించడానికి ఓపెనింగ్ బ్రాకెట్ పేరుతో మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు.

హీరో వరుణ్ తేజ్ గ్రామోఫోన్‌లో మ్యూజిక్‌ని ప్లే చేయడంతో ఈ వీడియో మొదలైంది. ఇది రెండు వేర్వేరు టైమ్‌లైన్‌లలో పాత్రలని ప్రజెంట్ చేస్తోంది. నవీన్ చంద్ర గ్యాంగ్‌స్టర్‌గా కనిపించగా, పి రవిశంకర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. కథానాయకుడు చైల్డ్ వుడ్ పోర్షన్‌లో కబడ్డీ ఆడుతూ కనిపించారు. అతను గ్యాంబ్లింగ్ మాఫియాకు అధిపతిగా ఎదుగుతాడు. సిగార్ తాగుతూ ఎవరికో ఫోన్‌లో ‘ప్రామిస్’ అనడం ఆసక్తికరంగా వుంది. క్లిప్‌లో వరుణ్ తేజ్‌ని పూర్తిగా చూపించనప్పటికీ, చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను పోషించడానికి అతను పూర్తిగా మేకోవర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని డ్రెస్సింగ్ 80ల నాటి ఫ్యాషన్ స్టయిల్‌ని పోలి వుంది. వరుణ్ తన హావభావాలు, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇంటెన్స్‌ని తీసుకొచ్చారు. ‘ప్రామిస్’ అనే డైలాగ్ బలమైన ప్రభావాన్ని చూపుతోంది. (Matka Opening Bracket Video)


Mega-Prince.jpg

1958, 1982 మధ్య జరిగే కథ కాబట్టి, 50ల నుండి 80ల వరకు ఉన్న వాతావరణాన్ని రీక్రియేట్ చేయడంలో దర్శకుడు కరుణ కుమార్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. సాంకేతిక వర్గాల పనితీరు కూడా హై లెవల్లో ఉంది. మొత్తం మీద, ఓపెనింగ్ బ్రాకెట్ సినిమాపై క్యురియాసిటీని పెంచేదిగా ఉంది. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా ‘మట్కా’ కథను రూపొందించారు. 24 ఏళ్లుగా సాగే కథతో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Hansika: 34 నిమిషాల షాట్‌ని సింగిల్ టేక్‌లో..

***************************

*Nayanthara: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణలు చెప్పిన నయనతార

****************************

*Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతికి మొగల్తూరులో ఏం చేస్తున్నారంటే..

****************************

*Guntur Kaaram: ‘కుర్చీ మడతపెట్టి’ పాట.. నిజంగానే మడతపెట్టేస్తోంది

*****************************

Updated Date - Jan 19 , 2024 | 04:27 PM