Vasanth Ravi: సూపర్ స్టార్ ప్రశంస ఎన్నటికీ మరిచిపోను
ABN , Publish Date - Apr 19 , 2024 | 09:58 AM
సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కలిసి ‘జైలర్’ చిత్రంలో నటించే సమయంలో ‘మీలాంటి నటుడితో కలిసి నటించడం చాలా గర్వంగా ఉంది’ అంటూ ప్రశంసించారని, అది జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేనిదని హీరో వసంత్ రవి అన్నారు. తన పుట్టిన రోజు వేడుకలను తాజాగా ఆయన మీడియా మిత్రులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రజినీకాంత్ ప్రశంసను గుర్తు చేసుకున్నారు.
 
                                    
సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth)తో కలిసి ‘జైలర్’ (Jailer) చిత్రంలో నటించే సమయంలో ‘మీలాంటి నటుడితో కలిసి నటించడం చాలా గర్వంగా ఉంది’ అంటూ ప్రశంసించారని, అది జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేనిదని హీరో వసంత్ రవి (Vasanth Ravi) అన్నారు. తన పుట్టిన రోజు వేడుకలను తాజాగా ఆయన మీడియా మిత్రులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రజినీకాంత్ (Rajinikanth) ప్రశంసను గుర్తు చేసుకున్నారు.
*Mirai: హనుమాన్‌కు ముందే.. ‘మిరాయ్’ సినిమా కథ ఫైనలైంది
ఈ కార్యక్రమంలో వసంత్ రవి (Vasanth Ravi) మాట్లాడుతూ.. ‘నేను సినిమాల్లో నటించాలని అనుకున్నపుడు రజినీకాంత్ దగ్గరకు వెళ్ళి ఆయన సలహా తీసుకున్నాను. ఆ తర్వాత ఆయనతోనే ‘జైలర్’ చిత్రంలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా తొలి చిత్రం ‘తరమణి’ నుంచి ‘అశ్విన్స్’ వరకు మీడియా ఎంతగానో సపోర్టు చేసింది. అందుకే మీడియా మిత్రుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలను జరుపుకుని, వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను.

ప్రస్తుతం నేను నటించిన ‘పొన్ ఒండ్రు కండేన్’ (Pon Ondru Kanden) చిత్రం జియో సినిమాలో విడుదలకానుంది. ఇప్పటివరకు నేను నటించిన చిత్రాలన్నీ సీరియస్ బాణీలోనే కొనసాగాయి. ‘జైలర్-2’ (Jailer 2) వస్తుందని అందరూ అంటున్నారు. కానీ, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలి. ‘జైలర్-2’ ఎలా ఉండబోతుందో కూడా తెలియదు. కానీ, ‘జైలర్’ క్లైమాక్స్ మాత్రం కొనసాగింపుకు ఛాన్స్ ఉందనే విషయాన్ని తెలియజేసేలా ఉంది. ‘తరమణి’, ‘రాకీ’, ‘అశ్విన్స్’ చిత్రాలకు ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చినా ప్రేక్షకులు ఆదరించడం సంతోషంగా ఉంది. ‘పొన్ ఒండ్రు కండేన్’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తుందని చెప్పుకొచ్చారు.
 
                                     
                                     
                                     
                                    