Jailer Audio Function: ఇదీ తలైవా రేంజ్‌..

ABN , First Publish Date - 2023-07-24T20:00:53+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఏం చేసిన సంచలనమే! స్టైల్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా చెబుతుంటారు ఆయన అభిమానులు. తాజాగా ఆయన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ రేంజ్‌, క్రేజ్‌ తెలిసేలా ఓ సంఘటన జరిగింది. రజనీకాంత్‌ తాజాగా నటించిన చిత్రం ‘జైలర్‌’. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Jailer Audio Function: ఇదీ తలైవా రేంజ్‌..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth) ఏం చేసిన సంచలనమే! స్టైల్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా చెబుతుంటారు ఆయన అభిమానులు. తాజాగా ఆయన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ రేంజ్‌, క్రేజ్‌ తెలిసేలా ఓ సంఘటన జరిగింది. రజనీకాంత్‌ తాజాగా నటించిన చిత్రం ‘జైలర్‌’(jailer). ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించి 1000 పాసులు అభిమానులకు ఉచితంగా ఇస్తామని, అయితే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపింది నిర్మాణ సంస్థ. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఓపెన్‌ చేసిన 15 సెకెన్లలో మొత్తం పాస్‌లు ఫ్యాన్స్‌ క్లైమ్‌ చేసుకున్నారని మేకర్స్‌ తెలియజేశారు. దీంతో ‘ఇదీ తలైవా రేంజ్‌’ (Thalaiva range) అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం గురించి సంగీత దర్శకుడు అనిరుద్‌ ఓ ఆసక్తికర విషయం చెప్పారు. ‘జైలర్‌’ గురించి చెప్పాలని ఓ అభిమాని ప్రశ్నించగా అనిరుద్‌ బదులిచ్చారు. ‘ఈ చిత్రం రజనీకాంత్‌ గత చిత్రాలకంటే చాలా భిన్నంగా ఉంటుందని, అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని’ చెప్పారు. దీంతో తలైవా అభిమానులు ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు డబుల్‌ అయ్యాయి. మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌తో పాటు కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌ కుమార్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్నా కథానాయిక. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-07-24T20:00:53+05:30 IST