Mirai: హనుమాన్‌కు ముందే.. ‘మిరాయ్’ సినిమా కథ ఫైన‌లైంది

ABN , Publish Date - Apr 18 , 2024 | 08:25 PM

తేజ సజ్జ సూపర్ యోధాగా రూపొందుతున్న చిత్రం మిరాయ్‌. కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా గ్లింప్స్‌ను గురువారం విడుద‌ల చేశారు.

Mirai: హనుమాన్‌కు ముందే.. ‘మిరాయ్’ సినిమా కథ ఫైన‌లైంది
mirai

ఇది అశోక చ‌క్ర‌వ‌ర్తి మరియు అతని 9 రహస్యాల ఆధారంగా రూపొందించబడింది. కళింగ యుద్ధం అశోకుని చరిత్రలో చెడ్డ గుర్తుగా మిగిలిపోయింది. ఆ పశ్చాత్తాపంలోనే దైవ రహస్యం వెల్లడైంది. అంటే మనిషిని దైవంగా మార్చే 9 గ్రంథాల అపారమైన జ్ఞానం. తరతరాలుగా వారిని రక్షించేందుకు 9 మంది యోధులను నియమించారు. అటువంటి జ్ఞానానికి గ్రహణం చేరుకుంటుంది. అప్పుడు గ్రహణాన్ని ఆపడానికి ఒక జన్మ పడుతుంది. తరతరాలుగా ఇది అనివార్యమైన మహా యుద్ధం అంటూ బుద్ధ సన్యాసి చెప్పే డైలాగుల‌తో సినిమా కథనం మనల్ని కట్టిపడేస్తుంది. ఇంతకు ముందు చూడని విజువల్ వండర్ లా ఈ చిత్రం ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది. ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పై కార్తీక్ ఘట్టమ‌నేనికి ఉన్న గ్రిప్ ఏంటో.. గ్లింప్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది.

కథకు హిస్టారిక్ టచ్ ఉన్నప్పటికీ, అది ఎంగేజింగ్ గా చెప్పారు. అశోకుడి 9వ రహస్యానికి గ్రహణం రాకుండా ఆపడానికి వచ్చిన సూపర్ యోధగా తేజ సజ్జ ఎంట్రీ అద్భుతంగా ఉంది. తను కర్రసాము మరియు ఇతర పోరాటాలలో రాణించాడు. సూపర్ యోధాగా సరిగ్గా నప్పుతూ అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు వచ్చాడు. కథానాయికగా నటించిన రితికా నాయక్ (Ritika Nayak) కు మంచి పాత్ర లభించినట్టు తెలుస్తుంది. కార్తీక్ ఘట్టమ‌నేని (Karthik Gattamneni) సినిమాటోగ్రఫీలో తన నైపుణ్యాన్ని చూపించి ప్రతి ఫ్రేమ్ డైమండ్ లా చూపించాడు. గౌర హరి తన అద్భుతమైన స్కోర్ తో కథనాన్ని మరింత ఇంటరెస్టింగ్ గా తీసుకు వెళ్లాడు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు ప్రపంచ స్థాయికి తక్కువ కాకుండా ఉన్నాయి, ఒక అంతర్జాతీయ సినిమా చూస్తున్న అనుభూతిని పొందుతాము. మిరాయ్ గ్లింప్స్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది మరియు తదుపరి అప్డేట్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది.

కార్తీక్ ఘట్టంనేని స్క్రీన్ ప్లే రాయగా మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగాల కాగా, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల. కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కాగా, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.గ్లింప్స్ ద్వారా నిర్మాతలు మిరాయ్ ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ మరియు చైనీస్ భాషల్లో ఏప్రిల్ 18న వేసవిలో 2D మరియు 3D వెర్షన్ లలో సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ, మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం. దాన్ని కొందరు కాపాడుతుంటారు. ఇది సినిమా విడుదలయ్యాక మరింత బాగా అర్థమవుతుంది. ఈ కథ కోసం చాలా నేర్చుకుని నేను సినిమా చేస్తున్నా. హనుమాన్ కు ముందే ఈ సినిమా కథను తేజ కు చెప్పాను. పదేళ్ళుగా తనతో జర్నీ చేస్తున్నా. ఇదొక అద్భుతమైన సినిమాగా మలచబోతున్నాను అని అన్నారు.

mirai.jpeg


చిత్ర నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మాట్లాడుతూ, కార్తీక్ తో జర్నీ చాలా బాగుంది. తనకు ఓ విజన్ వుంది. ఈ సినిమాలో ప్రతి పైసా వెండితెరపై కనులపండువలా వుంటుంది. పాన్ వరల్డ్ గా సినిమాను చేయనున్నాం. తేజ సజ్జకు ముందు రికార్డ్ లను బద్దలు కొట్టే సినిమా మిరాయ్ వుంటుంది అని చెప్పారు. డి. సురేష్ బాబు మాట్లాడుతూ, విశ్వ్రసాద్, కార్తీక్, తేజ ముగ్గురి డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరుతుంది. సంగీత దర్శకుడు గౌరి సంగీతం చాలా నైస్ గా వుంది. అందరూ కలిసి వండరల్ ఫుల్ సినిమాను అందిస్తున్నారని గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది అని అన్నారు. తేజ సజ్జ మాట్లాడుతూ, హనుమాన్ తర్వాత రిలాక్స్ అయిపోయావా..అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ప్రదీదీ జాగ్రత్తగా స్టెప్ వేయాలని తీసుకున్న నిర్ణయం ఈ సినిమా. ముందు సినిమాలు ఒక ఐడియాతో చేశాం. ఈ సినిమా అయితే మాకున్న వనరులతో పెద్ద సినిమాగా చేయబోతున్నాం. ముందుగా గ్లింప్స్ విడుదలయింది. నన్ను యోధునిగా కార్తీక్ చూపించబోతున్నాడు. తనతో పదేళ్ళ జర్నీ వుంది. ఆయన విజన్ చాలా గొప్పగా వుంటుంది. విశ్వప్రసాద్ గారితో సినిమా చేయడం మరింత ఆనందంగా వుంది. ఇదే రామానాయుడు స్టూడియో నా కెరీర్ మొదలయింది. ఈరోజు ఇక్కడే గ్లిమ్ప్స్ విడుదల చేయడం మరింత ఆనందంగా వుంది. ఆరునెలల క్రితమే ఈ సినిమాను మొదలు పెట్టాం. వచ్చే ఏడాది విడుదలనాడు గుడ్ ఫ్రైడే. నాకూ అందరికీ గుడ్ ప్రైడ్ అవుతుందని ఆశిస్తున్నాను అని చెప్పారు.

WhatsApp Image 2024-04-18 at 5.45.35 PM.jpeg

నందిని రెడ్డి మాట్లాడుతూ, తేజ చాలా టాలెంటెడ్. సురేష్ బాబుగారి దగ్గర స్రిప్ట్, చిరంజీవిగారి దగ్గర కథను ఎలా సెలక్ట్ చేసుకోవాలో నేర్చుకున్నాడు. తనలోని గొప్ప క్వాలిటీతో మంచి సినిమాలు చేస్తున్నాడు. ఓ బేబీ నుంచి హనుమాన్ వరకు గమనిస్తున్నా తను సెల్ప్ మేడ్ స్టార్ అని అన్నారు. అద్భుతం దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ, గ్లింప్స్ లో ప్రతీ షాట్ డిజైన్ బాగా చేశారు. తేజ మొదటి నుంచి కథల ఎంపికలో చాలా కేర్ తో చేస్తున్నాడు. విశ్వప్రసాద్ గారికి, గౌరవ్ హరి, నాగేంద్ర కలిసి అద్భుతమైన వండర్ ఇవ్వబోతున్నాను. హనుమాన్ త్వాత తేజ ఏ సినిమా చేయాలనుకుం టున్నప్పుడు కరెక్ట్ గా ఈ సినిమా కుదిరింది అని చెప్పారు. క్రిష్ణ చైతన్య మాట్లాడుతూ, హరి గౌర ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు. మిరాయ్ అద్భతమైన సినిమా అవుతుంది అన్నారు. బేబీ నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ, మిరాయ్ సినిమా తేజకూ, విశ్వప్రసాద్ గారికి కలికితురాయిలా మిగులుతుంది. గ్లింప్స్ చూస్తే గర్వంగా అనిపించింది. తెలుగు సినిమా మరో మెట్టు ఎక్కింది. టాప్ స్టార్స్ ఇలాంటి సినిమాలు చేయడం మామూలే. అప్ కమింగ్ హీరో ఇలాంటి కథతో చేయడం విశేషం. విశ్వప్రసాద్ గారి తపన ప్రతి ప్రేమ్ లో కనిపిస్తుంది. క్వాలిటీకి ్రపాధాన్యత ఇస్తారు. ఈ సినిమాను ఇంటర్ నేషనల్ స్థాయికి విశ్వప్రసాద్ తీసుకెళతారని తేజ చెప్పారు. గ్లింప్స్ విజువల్ పోయెట్రీ లా వుంది. ఈ సినిమాతో తేజ మరింత పెద్ద హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Updated Date - Apr 18 , 2024 | 08:25 PM