Shriya Reddy: వెబ్‌ సిరీస్‌ కోసం బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకున్న శ్రేయారెడ్డి

ABN , Publish Date - May 19 , 2024 | 10:31 AM

దర్శకుడు వసంత్‌ బాలన్‌ దర్శకత్వం వహించిన ‘తలమై సెయల్గమ్’ కోసం ప్రముఖ నటి శ్రేయారెడ్డి తన బాడీ లాంగ్వేజ్‌తో పాటు తన శరీర సౌష్టవాన్ని మార్చుకున్నారు. కిషోర్‌, శ్రేయారెడ్డి, భరత్‌, రమ్య నంబీశన్‌, ఆదిత్య మేనన్‌, నిరూప్‌ నందకుమార్‌, దర్షా గుప్తా, కవితా భారతి వంటివారు నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

Shriya Reddy: వెబ్‌ సిరీస్‌ కోసం బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకున్న శ్రేయారెడ్డి
Shriya Reddy

దర్శకుడు వసంత్‌ బాలన్‌ దర్శకత్వం వహించిన ‘తలమై సెయల్గమ్’ (Thalaimai Seyalagam) కోసం ప్రముఖ నటి శ్రేయారెడ్డి (Shriya Reddy) తన బాడీ లాంగ్వేజ్‌తో పాటు తన శరీర సౌష్టవాన్ని మార్చుకున్నారు. కిషోర్‌, శ్రేయారెడ్డి, భరత్‌, రమ్య నంబీశన్‌, ఆదిత్య మేనన్‌, నిరూప్‌ నందకుమార్‌, దర్షా గుప్తా, కవితా భారతి వంటివారు నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. సినీ నటి రాధికా శరత్‌కుమార్‌, నటుడు ఆర్‌. శరత్‌ కుమార్‌ కలిసి రాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ పతాకంపై ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్‌లో శ్రేయారెడ్డి అతి ముఖ్యమైన పాత్రను పోషించారు. (Thalaimai Seyalagam Web Series)

*Kalki 2898AD Bujji: భైరవుడి ‘బుజ్జి’ ఎవరో తెలిసిపోయింది.. అరుపులే!


ఇందుకోసం పాత్ర డిమాండ్‌ మేరకు తనను అన్ని విధాలుగా ఆమె మార్చుకున్నారు. పైగా వసంతబాలన్‌ (G Vasanthabalan) దర్శకత్వం కావడంతో ఎలాంటి భయం లేకుండా ఆమె దర్శకుడు చెప్పినట్టుగా తనను తాను మార్చుకుని నటించారు. దీంతో ఆమె పాత్రను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. కాగా, విశాల్‌ ‘తిమిరు’ చిత్రంలో విలన్‌ పాత్రను పోషించి మంచి పేరుతో పాటు గుర్తింపు తెచ్చుకున్న శ్రేయారెడ్డి... ఆ తర్వాత విశాల్‌ అన్నను పెళ్ళి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. గత కొన్ని నెలలుగా మళ్లీ సినిమాల్లో నటిస్తూ, వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు. (Shriya Reddy Makover in Thalaimai Seyalagam)


Thalaimai-Seyalagam.jpg

రీసెంట్‌గా వచ్చిన ‘సలార్’ చిత్రంలో శ్రేయా రెడ్డి రాధ రమా మన్నార్ (Radha Rama Mannar) పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ చిత్రంలోనూ ఆమె ఓ పవర్ ఫుల్ పాత్రను చేస్తున్నట్లుగా స్వయంగా ఆమెనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - May 19 , 2024 | 10:31 AM