Big Brother: భోజపురి రాజమౌళి చిత్రం విడుదలకు రెడీ..
ABN , Publish Date - May 18 , 2024 | 07:18 PM
‘అక్కడొకడుంటాడు, మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి’ చిత్రాలతో రివార్డులు, అవార్డులు పొందిన బహుముఖ ప్రతిభాశాలి శివ కంఠంనేని టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘బిగ్ బ్రదర్’. ఈ సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. భోజపురిలో అపజయం అనేది లేని గోసంగి సుబ్బారావు ఈ చిత్రానికి దర్శకుడు.
 
                                    
‘అక్కడొకడుంటాడు, మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి’ చిత్రాలతో రివార్డులు, అవార్డులు పొందిన బహుముఖ ప్రతిభాశాలి శివ కంఠంనేని (Siva Kantamaneni) టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘బిగ్ బ్రదర్’ (Big Brother). ఈ సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. భోజపురిలో అపజయం అనేది లేకుండా దూసుకుపోతూ ‘రాజమౌళి ఆఫ్ భోజపురి’గా నీరాజనాలు అందుకుంటున్న దర్శకుడు గోసంగి సుబ్బారావు (Gosangi Subbarao) చాలా విరామం తర్వాత ఈ చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నారు.
*Chitrangada Singh: ఆమె వయసు 48, కానీ ఆమెని చూస్తే అబ్బా...
లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కె. శివశంకర్ రావు - ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఘంటా శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే నటించగా.. శ్రీ సూర్య, ప్రీతి శుక్లా మరో జంటగా నటించారు.

ఈ సందర్భంగా దర్శకుడు గోసంగి సుబ్బారావు (Director Gosangi Subbarao) మాట్లాడుతూ... అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో... ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ దట్టించి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. శివ కంఠంనేని మరోసారి ఇందులో అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. నందమూరి కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ చిత్రం ‘బింబిసార’కు యాక్షన్ కొరియోగ్రఫి చేసిన ఫైట్ మాస్టర్ రామకృష్ణ డిజైన్ చేసిన రొమాంఛిత పోరాటాలు ఈ చిత్రానికి బిగ్ ఎట్రాక్షన్. ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నాం. ఈ చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఇకపై తెలుగులో వరసగా సినిమాలు చేస్తానని తెలిపారు.
Read Latest Cinema News
 
                                     
                                     
                                     
                                    