Kalki 2898AD Bujji: భైరవుడి ‘బుజ్జి’ ఎవరో తెలిసిపోయింది.. అరుపులే!

ABN , Publish Date - May 18 , 2024 | 09:09 PM

‘డార్లింగ్స్‌ ఎట్టకేలకు మన జీవితాల్లోకి ఒక ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు, వేచి చూడండి’ అంటూ ఆయన ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ క్షణాల్లో వైరల్‌ అవ్వడంతో పాటు పలు రకాల ఊహాగానాలకు తెరలేపింది. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్‌ ఓ ఇంటివాడవబోతున్నారు అని, తన కాబోయే జోడీని పరిచయం చేయబోతున్నారనీ కొందరు నెటిజన్లు స్పందిస్తున్న క్రమంలో.. ‘కల్కి 2898 AD’ వచ్చిన అప్‌డేట్‌తో ఆ ఉత్కంఠకు తెరపడింది.

Kalki 2898AD Bujji: భైరవుడి ‘బుజ్జి’ ఎవరో తెలిసిపోయింది.. అరుపులే!
Bhairava's Bujji

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ చిత్రం ‘కల్కి 2898 AD’ (Kalki 2898AD Movie). రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan) వంటి ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్‌తో సహా దీపికా పదుకొణె (Deepika Padukone), దిశా పటాని (Disha Patani) లాంటి ప్రముఖ తారాగణంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 27 జూన్, 2024న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి మే 9న ఈ చిత్రం విడుదలకావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల జూన్‌కి వాయిదా పడింది. ప్రస్తుతం మేకర్స్ చిత్ర ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా తాజాగా ప్రభాస్ ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్ (Prabhas Instagram Post) సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

*Pushpa 2: అల్లు అర్జున్ చేసిన పని 'పుష్ప 2' పై ప్రభావం చూపిస్తుందా?


‘డార్లింగ్స్‌ ఎట్టకేలకు మన జీవితాల్లోకి ఒక ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు, వేచి చూడండి’ అంటూ ఆయన ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ క్షణాల్లో వైరల్‌ అవ్వడంతో పాటు పలు రకాల ఊహాగానాలకు తెరలేపింది. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్‌ (Prabhas) ఓ ఇంటివాడవబోతున్నారు అని, తన కాబోయే జోడీని పరిచయం చేయబోతున్నారనీ కొందరు నెటిజన్లు స్పందిస్తున్న క్రమంలో.. ఇది ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898AD) చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ పోస్ట్‌గా వైజయంతీ మూవీస్ చేసిన ‘బుజ్జి’ పోస్ట్‌తో అర్థమైంది. ఇక ప్రభాస్ ఇన్‌స్టా పోస్ట్, అలాగే భైరవుడి బుజ్జి (Bhairava’s Bujji) ఎవరనే ఉత్కంఠకు తెరపడింది.


Bhairava.jpg

ప్రభాస్ చెప్పిన ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరో కాదు.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారు అనేలా తెలుపుతూ.. ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కూడా ఎవరయ్యా బుజ్జి అని అడుగుతూ.. చివరిలో ప్రభాస్‌తో కార్‌ని రివీల్ చేశారు కానీ.. బుజ్జిని పూర్తి స్థాయిలో చూపించలేదు. మే 22న బుజ్జి (Building A Superstar BUJJI)ని రివీల్ చేస్తామని ఈ వీడియోలో తెలిపారు. కాగా.. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో అన్ బిలివబుల్ తారాగణంతో వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) నిర్మిస్తోన్న ఈ ట్రూ పాన్-ఇండియా సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 18 , 2024 | 09:15 PM