Honeymoon Express: అడివి శేష్ వదిలిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూడో పాట

ABN , Publish Date - May 18 , 2024 | 08:29 PM

ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత, దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన మూడో పాటని మేకర్స్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా విడుదల చేశారు.

Honeymoon Express: అడివి శేష్ వదిలిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూడో పాట
Honeymoon Express Song Launch Event

ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ (యుఎస్ఎ) (NRI Entertainments (USA) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకంపై చైతన్య రావు (Chaitanya Rao), హెబ్బా పటేల్ (Hebah Patel) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ (Honeymoon Express). తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని (Bala Rajasekharuni) రచయిత, దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ‌ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ (Kalyani Malik) స్వరపరిచిన రెండు రొమాంటిక్ మెలోడీ పాటలు విడుదలై మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మూడో పాటను యాక్షన్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

*Chitrangada Singh: ఆమె వయసు 48, కానీ ఆమెని చూస్తే అబ్బా...

‘గూఢచారి 2’, ‘డెకాయిట్’ చిత్రాలతో బిజీగా ఉన్న అడివి శేష్ (Adivi Sesh).. దర్శకుడు బాల గారి చిరకాల పరిచయం వలన అన్నపూర్ణ 7 ఎకర్స్ ప్రాంగణంలో ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ లోని ‘క్యూట్‌గా స్వీట్‌గా’ (Cute gaa..Sweetu gaa) అనే అందమైన లిరికల్ సాంగ్‌ని వీక్షించి విడుదల చేశారు. విడుదల అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ.. ఈ పాట నిజంగానే చాలా స్వీట్‌గా ఉంది, సాహిత్యం చాలా బాగుంది అని కొనియాడారు. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.


Honeymoon-Express.jpg

దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, మా చిత్రంలోని ‘క్యూట్‌గా స్వీట్‌గా’ అనే పాటను విడుదల చేసిన అడివి శేష్ గారికి నా కృతజ్ఞతలు. అడివి శేష్ తన మొదటి చిత్రం అమెరికాలో విడుదల చేయడానికి నన్ను సంప్రదించారు. తనకు మంచి టాలెంట్ ఉంది అని అప్పుడే గమనించాను. ఈ సినిమా మంచి మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మా చిత్రంలోని ప్రతి పాట చాలా బాగుంటుంది. మంచి పాటలు స్వరపరిచిన కళ్యాణి మాలిక్‌గారికి కృతజ్ఞతలు. ఈ ‘క్యూట్‌గా స్వీట్‌గా’ పాటకు కిట్టూ విస్సాప్రగడ లిరిక్స్ అందించగా ‘బాహుబలి’ ఫేమ్ దీపు తన గాత్రంతో ప్రాణం పోశారు. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసి.. ఆ వెంటనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. (Honeymoon Express 3rd Song Launched)

Read Latest Cinema News

Updated Date - May 18 , 2024 | 08:29 PM