కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mangai: తెలుగమ్మాయ్ ప్రధాన పాత్రలో తమిళ చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల

ABN, Publish Date - Jan 02 , 2024 | 05:33 PM

జేఎస్ఎం పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత ఏఆర్‌ జాఫర్‌ నిర్మాణ సారథ్యంలో కయల్‌ ఆనంది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మంగై’. కుబేంద్రన్‌ కామాచ్చి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకులు వెట్రిమారన్‌, అమీర్‌, నటుడు విజయ్‌ సేతుపతి కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేశారు.

Mangai Movie First Look Poster

జేఎస్ఎం పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత ఏఆర్‌ జాఫర్‌ నిర్మాణ సారథ్యంలో కయల్‌ ఆనంది (Kayal Anandhi) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మంగై’. కుబేంద్రన్‌ కామాచ్చి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకులు వెట్రిమారన్‌ (VetriMaaran), అమీర్‌ (Ameer), నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేశారు. అమీర్‌ ప్రధాన పాత్రలో ఏఆర్‌ జాఫర్‌ (AR Jaffer) ‘ఇరైవన్‌ మిగ పెరియవన్‌’ అనే పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు, హీరోయిన్‌ ప్రధాన పాత్రలో ‘మంగై’ (Mangai) పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... ‘‘ఇది ఒక మహిళ జీవన ప్రయాణాన్ని వివరించే చిత్రం. మున్నార్‌, పూంపారై, కేరళ, తేని, కంభం, గూడలూరు, లోయర్‌ క్యాంపు, చెన్నై తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాం. ఆనంది ఈ చిత్రంతో మరోసారి తన నటనాపటిమను చాటనున్నారు. ఆమె పాత్రే ఈ చిత్రానికి కీలకం. శశికుమార్‌ నటించిన ‘ఈసన్‌’ సినిమాలో కీలక పాత్రను పోషించిన దుషి ఇందులో ఓ ముఖ్యపాత్రను పోషించారు. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి, ఫిబ్రవరిలో ఆడియో, ట్రైలర్‌ను రిలీజ్‌ చేసి, మార్చి నెలలో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం’’ అని వివరించారు. (Mangai Movie First Look Out)


హీరోయిన్ ఆనంది (Anandhi) విషయానికి వస్తే.. తెలంగాణకు చెందిన తెలుగమ్మాయి అయిన ఆనంది.. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతోంది. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ.. తమిళ ప్రేక్షకులకు ఆమె బాగా దగ్గరైంది. తమిళ్‌లో చేసిన ‘కయల్’ చిత్రం ఆమెకు నటిగా మంచి గుర్తింపుని, ఆ సినిమాలో నటనకుగానూ పలు అవార్డులను తెచ్చిపెట్టింది. ఇప్పుడు తమిళ్‌తో పాటు.. తెలుగులోనూ ఆమెకి అవకాశాలు వరిస్తున్నాయి. రీసెంట్‌గా ఆమె తెలుగులో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘కస్టడి’ వంటి చిత్రాల్లో నటించింది.


ఇవి కూడా చదవండి:

====================

*Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ దర్శకుడు వదిలిన సర్క్యులర్ చూశారా..

****************************

*SV Ranga Rao: ముత్యాల సుబ్బయ్యకు ముచ్చెటమలు పట్టించిన ఎస్వీఆర్.. విషయం ఏమిటంటే?

************************

*Guntur Kaaram: మాస్‌ బీట్‌‌ని.. నెటిజన్లు మడతెట్టేస్తున్నారు..

****************************

*Kotabommali PS in OTT: ‘కోటబొమ్మాళి PS’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*********************************

Updated Date - Jan 02 , 2024 | 05:33 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!