Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ దర్శకుడు వదిలిన సర్క్యులర్ చూశారా..

ABN , Publish Date - Jan 02 , 2024 | 04:18 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని రూపొందించి.. దర్శకుడిగా సాగర్ కె చంద్ర తన ప్రతిభను చాటుకున్నారు. ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయడానికా కాస్త ఆలస్యం అయినప్పటికీ.. ‘భీమ్లా నాయక్’కి ఏ మాత్రం తగ్గని సినిమాని చేస్తున్నట్లుగా అయితే హింట్స్ వదులుతున్నారు. తాజాగా ఆయన రిలీజ్ చేసిన సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ దర్శకుడు వదిలిన సర్క్యులర్ చూశారా..
Director Saagar K Chandra

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) కాంబినేషన్‌లో ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) చిత్రాన్ని రూపొందించి.. దర్శకుడిగా సాగర్ కె చంద్ర (Saagar K Chandra) తన ప్రతిభను చాటుకున్నారు. ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయడానికా కాస్త ఆలస్యం అయినప్పటికీ.. ‘భీమ్లా నాయక్’కి ఏ మాత్రం తగ్గని సినిమాని చేస్తున్నట్లుగా అయితే హింట్స్ వదులుతున్నారు. ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ (Srinivas Bellamkonda)తో సాగర్ ఓ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తున్నారు. #BSS10 ట్యాగ్‌లో ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సర్క్యులర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసినట్లుగా ఉన్న ఈ సర్క్యులర్‌లో ఓ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ డిఎస్‌పి (DSP)గా త్వరలో చార్జ్ తీసుకోబోతున్నారని తెలుపుతూ.. ప్రజాహితముకై జారీ చేయడమైనదని పేర్కొన్నారు. ఈ కాపీని మీడియా సంస్థలకు, తెలుగు సినిమా అభిమానులకు పంపడం జరిగిందని ఇందులో తెలియజేశారు. ఈ అనౌన్స్‌మెంట్ చూస్తుంటే.. #BSS10 ఓ రేంజ్‌లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. అలాగే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్‌ని పోలీస్ ఆఫీసర్‌గా చూపించిన సాగర్.. ఈ సినిమాలోనూ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ని పోలీస్ ఆఫీసర్‌గానే చూపించబోతుండటం విశేషం.


DSP.jpg

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. #BSS10 టైటిల్, ఫస్ట్ లుక్ జనవరి 3వ తేదీన శ్రీనివాస్ బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. బెల్లంకొండను పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి సాగర్ కె చంద్ర పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ని రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. (#BSS10 Update)


ఇవి కూడా చదవండి:

====================

*SV Ranga Rao: ముత్యాల సుబ్బయ్యకు ముచ్చెటమలు పట్టించిన ఎస్వీఆర్.. విషయం ఏమిటంటే?

************************

*Guntur Kaaram: మాస్‌ బీట్‌‌ని.. నెటిజన్లు మడతెట్టేస్తున్నారు..

****************************

*Kotabommali PS in OTT: ‘కోటబొమ్మాళి PS’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*********************************

*Vijayakanth: ‘కెప్టెన్’ విజయకాంత్ గురించి ఆయన తోబుట్టువులు ఏం చెప్పారో తెలుసా?

************************************

Updated Date - Jan 02 , 2024 | 04:18 PM