Guntur Kaaram: మాస్‌ బీట్‌‌ని.. నెటిజన్లు మడతెట్టేస్తున్నారు..

ABN , Publish Date - Dec 31 , 2023 | 02:36 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమాకు సంబంధించి ఇంతకు ముందు వచ్చిన ‘ఓ మై బేబి’ పాట ఎన్ని విమర్శలను ఎదుర్కొందో తెలియంది కాదు. తాజాగా ఈ సినిమా నుండి ‘కుర్చీ మడతపెట్టి’ లిరికల్ సాంగ్‌ని వదిలారు. ఈ సాంగ్‌పై కూడా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనే వస్తోంది.

Guntur Kaaram: మాస్‌ బీట్‌‌ని.. నెటిజన్లు మడతెట్టేస్తున్నారు..
Guntur Kaaram Movie Song Still

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). ఈ సినిమాకు సంబంధించి ఇంతకు ముందు వచ్చిన ‘ఓ మై బేబి’ (Oh my Baby) పాట ఎన్ని విమర్శలను ఎదుర్కొందో తెలియంది కాదు. ఆ విమర్శలు తట్టుకోలేక.. పాట రచయిత రామజోగయ్య శాస్త్రి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా ప్రస్ట్రేషన్‌ని ప్రదర్శించారు. ఎలా గోలా ఆ పాట గొడవ సద్దుమణిగితే.. తాజాగా ఈ సినిమా నుండి మాస్ బీట్ ‘కుర్చీ మడతపెట్టి’ (Kurchi Madathapetti) సాంగ్‌ని మేకర్స్ వదిలారు. ఈ పాటపై కూడా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనే వస్తోంది. అయితే మహేష్ బాబు, శ్రీలీల (Sreeleela) డ్యాన్స్ స్టెప్స్‌పై మాత్రం అంతా పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. మహేష్ ఇందులో కుర్ర హీరోలా కనిపిస్తున్నాడని.. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అదుర్స్ అనేలా కామెంట్స్ వినబడుతున్నాయి.

Guntur-Kaaram.jpg

పాట విషయానికి వస్తే.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌ ప్రోమోని వదిలినప్పుడు.. ఓ ప్రైవేట్ సాంగ్ మ్యూజిక్‌ని యాజీటీజ్‌గా దింపేశారంటూ, మరో కాపీ ట్యూన్ అంటూ థమన్‌ని టార్గెట్ చేస్తూ ఒకటే కామెంట్స్. పూర్తి సాంగ్ విడుదలైన తర్వాత కొందరు ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటే.. మరికొందరు మాత్రం ఈ పాట లిరిక్స్‌పై, ట్యూన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కుర్చీ మడతబెట్టి’ అనేది బూతుగా భావిస్తూ.. ఈసారి ఇంకెవరైనా ఇంకో బూతు మాట్లాడితే.. అది కూడా రామజోగయ్య (Ramajogaiah Sastry) పాటగా రాసేస్తారు. మహేష్ బాబు సినిమా పాటకి ఇలాంటి బూతు పదాలను రాస్తారా? అంటూ కొందరు ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్‌తో చెలరేగుతున్నారు. (Social Media Talk on Guntur Kaaram Kurchi Song)


Guntru-Kaaram-2.jpg

మరో వైపు.. అల్లు అర్జున్ పాట ‘చిలకలూరి చింతామణి’ పాట, పవన్ కళ్యాణ్ పాడే ‘ఏం పిల్ల మాట్లాడవే’.. ఇలాంటి ట్యూన్స్ అన్నింటినీ థమన్ (Thaman S) ఇందులో దించేశాడు అంటూ గరంగరం అవుతున్నారు. ఇలా ఒకవైపు నెగిటివ్‌గా వినిపిస్తున్నా.. సాంగ్ మాత్రం యూట్యూబ్‌లో టాప్‌లో దూసుకెళుతూ.. నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. దాదాపు 24 గంటల్లో ఈ పాట ఒక కోటి వ్యూస్ రాబట్టే దిశగా వెళుతోంది. ఈ లెక్కన ఈ పాట హిట్టయినట్లే చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఈ మధ్య ప్రతీది జడ్జ్ చేసే వారు ఎక్కువయ్యారనే విషయాన్ని సినిమావాళ్లు దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే.. ఇలా ప్రతిదానికి దొరికేస్తారు. థమన్, రామజోగయ్య శాస్త్రిగారు ఏదో ఊహించుకుని ఈ సినిమాకు పాటలు చేస్తుంటే.. అక్కడ ఏదేదో అవుతుంది. మరి ఇది సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియాలంటే జనవరి 12 వరకు వెయిట్ చేయక తప్పదు.


ఇవి కూడా చదవండి:

====================

*Kotabommali PS in OTT: ‘కోటబొమ్మాళి PS’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*********************************

*Vijayakanth: ‘కెప్టెన్’ విజయకాంత్ గురించి ఆయన తోబుట్టువులు ఏం చెప్పారో తెలుసా?

************************************

*NBK109: ‘యానిమల్’ స్టార్‌ని బాలయ్య మూవీ సెట్స్‌లోకి ఆహ్వానించిన ఊర్వశి..

********************************

*Hi Nanna in OTT: ‘హాయ్ నాన్న’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

**************************

*Nagababu: కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి

**************************

Updated Date - Dec 31 , 2023 | 08:08 PM