Indian 2: ‘ఇండియన్‌-2’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

ABN , Publish Date - Apr 06 , 2024 | 04:12 PM

శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్‌-2’. కొన్నేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. సమ్మర్‌ స్పెషల్‌గా మే 24న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. 1996లో వచ్చిన ‘ఇండియన్‌’కి ఇది సీక్వెల్‌. ఇందులో కమల్‌తో పాటు కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌, సముద్రగని, బాబీ సింహా వంటి పలువురు నటించారు.

Indian 2: ‘ఇండియన్‌-2’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!
Indian 2 Movie Poster

శంకర్‌ (Shankar) దర్శకత్వంలో కమలహాసన్‌ (Kamal Haasan) నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్‌-2’ (Indian 2). కొన్నేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. సమ్మర్‌ స్పెషల్‌గా మే 24న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (Indian)కి ఇది సీక్వెల్‌. ఇందులో కమల్‌తో పాటు కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal), రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), సిద్ధార్థ్‌ (Siddharth), సముద్రగని, బాబీ సింహా వంటి పలువురు నటించారు.

*Manjummel Boys Movie Review: నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...


ఈ మూవీ తొలి భాగానికి ఏ.ఆర్‌.రెహ్మాన్‌ (AR Rahman) సంగీతం అందించగా, రెండో భాగానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ (Anirudh Ravichander) సంగీత స్వరాలు సమకూర్చారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని తుది దశ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ మూవీని సమ్మర్‌ స్పెషల్‌గా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో మే 24న విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.


Kamal.jpg

వాస్తవానికి ముందుగానే రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ, ఈ నెల 19వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ (Elections to Lok Sabha 2014) జరుగనుంది. అలాగే, పొరుగు రాష్ట్రాల్లో మే లో రెండో దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే, ఈ విడుదల తేదీపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. శనివారం సాయంత్రం ఈ విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions)తో పాటు రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ (RKFI), రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ (Red Giant Movies) సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో ఈ సినిమా ‘భారతీయుడు2’ (Bharateeyudu2)గా విడుదలకానుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

*************************

*Krishnamma: సత్యదేవ్ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణమ్మ’ ఆగమనం ఎప్పుడంటే..

***********************

*Kona Venkat: తారక్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..

Updated Date - Apr 06 , 2024 | 08:05 PM