Suriya44: సూర్య చిత్రంలో నటించాలనివుందా?

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:09 PM

హీరో సూర్య నటించే 44వ చిత్రంలో నటించేందుకు నటీనటుల ఎంపిక చేపట్టారు. ఇందుకోసం ఆసక్తిగల నటీనటులు సంప్రదించవచ్చని చిత్రయూనిట్ పేర్కొంది. ఇందుకోసం కాస్టింగ్‌ కాల్‌ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కాస్టింగ్‌ కాల్‌కు భాషతో సంబంధం లేకుండా ఎనిమిదేళ్ళ నుంచి 80 యేళ్ళ వయస్సున్న స్త్రీపురుషులు దరఖాస్తు చేసుకోవచ్చని చిత్రబృందం వెల్లడించింది.

Suriya44: సూర్య చిత్రంలో నటించాలనివుందా?
Suriya and Karthik Subbaraj

హీరో సూర్య (Hero Suriya) నటించే 44 (Suriya44)వ చిత్రంలో నటించేందుకు నటీనటుల ఎంపిక చేపట్టారు. ఇందుకోసం ఆసక్తిగల నటీనటులు సంప్రదించవచ్చని చిత్రయూనిట్ పేర్కొంది. ఇందుకోసం కాస్టింగ్‌ కాల్‌ (Casting Call for Suriya44) పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కాస్టింగ్‌ కాల్‌కు భాషతో సంబంధం లేకుండా ఎనిమిదేళ్ళ నుంచి 80 యేళ్ళ వయస్సున్న స్త్రీపురుషులు దరఖాస్తు చేసుకోవచ్చని చిత్రబృందం వెల్లడించింది.

*Love Me: దిల్ రాజు.. ‘ల‌వ్‌మీ’ వాయిదా! అందుకేనా


అలాగే, ఒకటి నుంచి మూడు నిమిషాల నిడివి కలిగిన వీడియో కూడా పంపించాలని పేర్కొంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు. ‘పిజ్జా’, ‘జిగర్తాండ’, సూపర్ స్టార్ రజినీకాంత్‌ (Super Star Rajinikanth)‌తో చేసిన ‘పేట’ వంటి చిత్రాలతో దర్శకుడిగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ (Karthik Subbaraj) మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన దర్శకత్వం వహించే చిత్రం, సూర్య నటించే 44వ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి.


Suriya44.jpg

పీరియాడిక్‌ గ్యాంగ్‌స్టర్‌, లవ్‌ నేపథ్యంలో ఈ స్టోరీ ఉంటుందని, సూర్య ద్విపాత్రాభినయం చేస్తారనే ప్రచారం సాగుతుంది. జూన్‌ 17 నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రానికి తిరునావుక్కరసు ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంతోష్‌ నారాయణన్‌ (Santhosh Narayanan) సంగీత స్వరాలు సమకూర్చనున్నారు. ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్మెంట్స్‌, స్టోన్‌బెంచ్‌ ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

Read Latest Tamil News

Updated Date - Apr 24 , 2024 | 04:09 PM