Suriya Birthday: కంగువా టీజర్ అదిరింది, సూర్య అభిమానులకు శుభవార్త

ABN , First Publish Date - 2023-07-22T13:10:45+05:30 IST

జులై 23 సూర్య పుట్టినరోజు సందర్భంగా అతని సినిమా 'కంగువా' నుండి ఒక చిన్న టీజర్ విడుదల అవబోతోంది. ఈరోజు అర్థరాత్రి ఈ టీజర్ ని విడుదల చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఈ టీజర్ ని కొంతమంది మీడియా వాళ్ళకి చూపించటం జరిగింది. అదెలా ఉందంటే...

Suriya Birthday: కంగువా టీజర్ అదిరింది, సూర్య అభిమానులకు శుభవార్త
Surya in Kanguva

తమిళ నటుడు సూర్య (Suriya) నటిస్తున్న 'కంగువా' #Kanguva సినిమా టీజర్ అదిరింది. శివ (Director Siva) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కథని ఆదినారాయణ (Adinarayana) రచించారు. జ్ఞానవేల్ రాజా (KEGnanavelRaja), యూవీ క్రియేషన్స్ (UVCreations) ఈ సినిమాని నిర్మించారు. ఇది 2024 సంవత్సరం మొదట్లో విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ టీజర్ ఈరోజు అర్థరాత్రి విడుదల చేయనున్నారు, అయితే ఈరోజు ఉదయం మీడియా వాళ్ళకి ఈ టీజర్ చూపించారు. ఇది ఒక పీరియడ్ డ్రామా, ఇందులో సూర్య అయిదు పాత్రలు వేస్తున్నట్టుగా తెలిసింది. బాలీవుడ్ నటి దిషా పటాని (DishaPathani) ఇందులో కథానాయికగా నటిస్తోంది, ఇది ఆమెకి మొదటి తమిళ సినిమా.

ఈ సినిమా 2డి, 3డి రెండు ఫార్మట్ లోనూ విడుదల చేస్తున్నట్టుగా నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పారు. ఇది దక్షిణాదిలో ఒక పెద్ద బడ్జెట్ సినిమా అవబోతోంది. దీనికి సుమారు రూ.350 కోట్ల వరకు బడ్జెట్ అయిందని పరిశ్రమలో బోగట్టా. ఇందులో సూర్య వైవిధ్యంగా కనపడనున్నాడని, అయిదు పాత్రలు వేస్తున్నాడని కూడా తెలిసింది. తమిళంలో పేరున్న రచయిత మదన్ కర్కి (MadhanKarky) దీనికి మాటలు రాస్తున్నారు.

kanguva-teaser1.jpg

నటుడు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఈ టీజర్ విడుదల చేస్తున్నారు. జులై 23 సూర్య పుట్టినరోజు, అందుకని ఈరోజు అర్థరాత్రి ఈ టీజర్ అన్ని సాంఘీక మాధ్యమాల్లోనూ విడుదల చేస్తారని నిర్మాతలు తెలియచేస్తున్నారు. మీడియా కి చూపించిన టీజర్ లో సూర్య పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుంది. నేపథ్యంలో అతని గురించి చెప్పే మాటాలు వినపడుతూ ఉంటే, సూర్య ఒక శూలం లాంటిది విసిరాగా అది పోయి ఒక వ్యక్తి గుండెల్లో దిగబడుతుంది. ఆ తరువాత ఎంతోమంది ప్రజలు అరుపులు కేకలు మధ్య సూర్య మొహం చూపిస్తారు, అప్పుడు సూర్య 'కుశలమా' అని అడుగుతాడు. అదొక్కటే డైలాగ్ అన్ని భాషల్లోనూ పెట్టు విడుదల చేస్తున్నారు.

Updated Date - 2023-07-22T13:10:45+05:30 IST