Yakshini: ‘యక్షిణి’లో జ్వాలగా మంచు లక్ష్మీ.. లుక్ అదిరింది

ABN , Publish Date - May 23 , 2024 | 05:27 PM

మంచు లక్ష్మీ నటిగా బిజీ అవుతోంది. ఇప్పటికే ఆమె నటించిన ‘ఆదిపర్వం’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా, తాజాగా ఆమె నటిస్తోన్న సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్‌ నుంచి మేకర్స్ ఆమె లుక్‌ని విడుదల చేశారు. దీంతో మంచు లక్ష్మీ.. టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారింది. ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ‘యక్షిణి’. ఇందులో జ్వాలగా మంచు లక్ష్మీ నటిస్తోంది.

Yakshini: ‘యక్షిణి’లో జ్వాలగా మంచు లక్ష్మీ.. లుక్ అదిరింది
Manchu Lakshmi in Yakshini

మంచు లక్ష్మీ (Manchu Lakshmi) నటిగా బిజీ అవుతోంది. ఇప్పటికే ఆమె నటించిన ‘ఆదిపర్వం’ (Adiparvam) చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా, తాజాగా ఆమె నటిస్తోన్న సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్‌ (Socio Fantasy Web Series) నుంచి మేకర్స్ ఆమె లుక్‌ని విడుదల చేశారు. దీంతో మంచు లక్ష్మీ.. టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారింది. ఆర్కా మీడియా వర్క్స్ (Arka Media Works), డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ (Disney plus Hotstar) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ‘యక్షిణి’ (Yakshini). ఈ వెబ్ సిరీస్‌ను ‘బాహుబలి’ (Bahubali) సిరీస్ చిత్రాల నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘కోటబొమ్మాళి పిఎస్’ (Kotabommali PS) ఫేమ్ దర్శకుడు తేజ మార్ని (Teja Marni) ఈ ‘యక్షిణి’ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో మంచు లక్ష్మీ పాత్రను పరిచయం చేస్తూ.. తాజాగా ఆమె లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

*Disaster Show: బుజ్జీ! ఎంతపనైపోయింది, టోటల్ ఫ్లాప్ కదా!

ఇందులో మంచు లక్ష్మీ మిస్టీరియస్ జ్వాల (Jwala)గా కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ నుంచి మంచు లక్ష్మి నటించిన జ్వాల క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో మంచు లక్ష్మీ చీరకట్టులో బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది. వెనుక బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే.. ఆమెది ఇందులో పవర్ ఫుల్ పాత్ర అనేది అర్థమవుతోంది. (Manchu Lakshmi Jwala in Yakshini)


Manchu-Lakshmi-Pic.jpg

ఫాంటసీ, రొమాన్స్, కామెడీ అంశాలతో రూపొందిన ఈ ‘యక్షిణి’ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని.. డైరెక్టర్ తేజ మార్ని (Director Teja Marni) విజన్‌కు తగినట్లుగా భారీ ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఆర్కా మీడియా వర్క్స్‌పై ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నామని నిర్మాతలు తెలియజేశారు. జూన్‌లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. (Yakshini Web Series)

Read Latest Cinema News

Updated Date - May 23 , 2024 | 05:57 PM