Adiparvam: ప్రచార చిత్రంతోనే ఫైర్ చూపించిన మంచు లక్ష్మీ

ABN , Publish Date - Mar 30 , 2024 | 04:19 PM

ఫైర్ బ్రాండ్ లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సోషియో ఫాంటసీ మల్టీలింగ్వల్ చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ కుమార్ మేగోటి దర్శకత్వంలో... రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్-ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకున్నట్లుగా చెబుతూ దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు.

Adiparvam: ప్రచార చిత్రంతోనే ఫైర్ చూపించిన మంచు లక్ష్మీ
Manchu Lakshmi in Adiparvam

ఫైర్ బ్రాండ్ లక్ష్మీ మంచు (Lakshmi Manchu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సోషియో ఫాంటసీ మల్టీలింగ్వల్ చిత్రం ‘ఆదిపర్వం’ (Adiparvam). సంజీవ్ కుమార్ మేగోటి (Sanjeev Kumar Megoti) దర్శకత్వంలో... రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్-ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో (తెలుగు - కన్నడ - హిందీ - తమిళ - మలయాళ) ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి... ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన ప్రచార చిత్రం (ట్రైలర్)కు విశేష స్పందన (Adiparvam Trailer Response) లభించడంతో చిత్రయూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రచార చిత్రంతోనే మంచు లక్ష్మీ తన ఫైర్ చూపించారంటూ కొనియాడారు.

Manchu-Lakshmi.jpg

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి (Sanjeev Kumar Megoti) మాట్లాడుతూ...‘‘ ‘ఆదిపర్వం’ ప్రచార చిత్రానికి లభిస్తున్న అనూహ్య స్పందన... ఈ చిత్రం కోసం మేము పడిన కఠోర శ్రమ మరిచిపోయేలా చేసింది. మంచు లక్ష్మీని ఈ సినిమాలో చూసిన వారంతా ఆశ్చర్యపోతారు. ఆమె కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలో సెన్సార్‌కు వెళ్లనున్నాం. బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ (Fire Brand) మంచు లక్ష్మీకి స్పెషల్ థాంక్స్’’ అని తెలిపారు.


Manchu-akka.jpg

మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోన్హా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ వంటి వారంతా ఇతర పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Kaliyugam Pattanamlo: షాక్.. ‘కలియుగం పట్టణంలో’ ఆపేశారు..

************************

*Anupama Parameswaran: ఆనందంలో మాటలు రావడంలేదు

************************

*VS10: విశ్వక్‌ సేన్ 10వ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్..

***********************

Updated Date - Mar 30 , 2024 | 04:19 PM