Hema: రేవ్ పార్టీ కవరింగ్ కోసం రెసిపీ.. హేమతో ఆడేసుకుంటోన్న నెటిజన్లు

ABN , Publish Date - May 21 , 2024 | 02:54 PM

బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రేవ్‌ పార్టీలో తెలుగు సినీ నటి హేమ ఉన్నట్లు వార్తలు రావడంతో ఆమె వెంటనే ఓ వీడియో వదిలి.. దానికి, నాకు ఏం సంబంధం లేదనేలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే బెంగళూరులోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీలో హేమ ఉన్నట్లుగా కన్నడ మీడియా కోడై కూస్తోంది. దీనిని కవర్ చేసేందుకు హేమ ఇన్‌స్టాలో రెసిపీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది.

Hema: రేవ్ పార్టీ కవరింగ్ కోసం రెసిపీ.. హేమతో ఆడేసుకుంటోన్న నెటిజన్లు
Actress Hema

బెంగళూరు (Bengaluru) సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రేవ్‌ పార్టీ (Rave Party)లో తెలుగు సినీ నటి హేమ (Actress Hema) ఉన్నట్లు వార్తలు రావడంతో ఆమె వెంటనే ఓ వీడియో వదిలి.. దానికి, నాకు ఏం సంబంధం లేదనేలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే బెంగళూరులోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీలో హేమ ఉన్నట్లుగా కన్నడ మీడియా కోడై కూస్తోంది. కన్నడ మీడియాకు హేమ ఫొటో లభించిందని, రేవ్ పార్టీలో ఏ డ్రస్‌లో అయితే హేమ ఉందో.. ఆమె నాకేం సంబంధం లేదంటూ పెట్టిన వీడియోలో కూడా సేమ్ డ్రస్‌లోనే ఉండటంతో.. ఆమె ఎంతగా బుకాయించాలని చూసినా.. బుక్ అయినట్లే అనేలా ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ రేవ్‌ పార్టీలో నటి హేమ (Hema) ఉన్నట్లుగా బెంగళూరు సిటీ కమిషనర్‌ దయానంద్‌ కూడా స్పష్టం చేయడంతో.. హేమ అడ్డంగా బుక్కయిందనేలా సోషల్ మీడియా అంతా ఒకటే టాక్.

*Director Mother: గీతా భాస్కర్ జీవితంలో ఆవకాయ ఎలా ఒక భాగం అయ్యిందంటే...


ఇదిలా ఉంటే.. ఈ రేవ్ పార్టీ వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకు, కవరింగ్ చేసుకునేందుకు హేమ శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒకవైపు హాట్ హాట్‌గా ఈ రేవ్ పార్టీపై చర్చలు నడుస్తుంటే.. నాకేం తెలియదు అన్నట్లుగా తాజాగా ఆమె ఇన్‌స్టా‌లో రెసిపీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసింది. తాజాగా ఆమె తన ఇన్‌స్టా అకౌంట్‌లో బిర్యానీ తయారీ అంటూ ఓ వీడియోని షేర్ చేసింది. ఇందులో బిర్యానీ మేకింగ్‌ని హేమ చేసి చూపిస్తోంది. అయితే నెటిజన్లు మాత్రం కామెంట్స్‌తో ఆమెను ఆడేసుకుంటున్నారు. (Hema Biryani Recipe Video)


Hema-Aunty.jpg

‘నువ్వు ఎంత కవర్ చేసినా.. బెంగళూర్ వీడియోస్ పక్కా బయటికి వస్తాయ్’, ‘నిన్న ఏం షో చేశావు.. రేవ్ పార్టీ నుంచి వీడియో కాల్ పెట్టి.. అబ్బో ఆరితేరిపోయావ్.. జీవిస్తున్నావు’, ‘మేడమ్ మీరు పార్టీలో వేసుకున్న డ్రస్ మరియు మీరు పోస్ట్ చేసిన వీడియోలో సేమ్ డ్రస్ మేడమ్.. దొరికిపోయారు. ఇన్ని రోజులు మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు.. సడెన్‌గా మీరు ఇలా పోస్ట్‌లు పెడితే.. కవరింగ్ కోసం చేస్తున్నారని పోలీసువాళ్లకి తెలిసిపోతుంది మేడమ్..’, ‘నీ కవరింగ్లు ఇక ఆపులే’.. అంటూ నెటిజన్లు హేమ పోస్ట్‌కు రియాక్ట్ అవుతున్నారు (Netizen Comments on Hema Video). ప్రస్తుతం ఈ రేవ్ పార్టీ వ్యవహారంపై ఇటు టాలీవుడ్, అటు కన్నడ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌గా వార్తలు నడుస్తున్నాయి. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర మాట్లాడుతూ.. రేవ్‌పార్టీలో కోట్ల రూపాయల విలువైన కొకైన్‌, గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీగా మార్చాలని మేము చేసే ప్రయత్నాలన్నీ ఇతర రాష్ట్రాల డ్రగ్స్‌ పెడ్లర్ల వల్ల ఫెయిల్ అవుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్‌ చేసిన వారి నుంచి మరిన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నామని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - May 21 , 2024 | 02:54 PM