Inspector Rishi: అమెజాన్ ప్రైమ్‌లో ‘ఇన్‌స్పెక్టర్ రిషి’.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:40 PM

హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్.. ఇలా పాత్ర ఏదైనా నటుడిగా తన బాధ్యతను వందశాతం నిర్వహించే నటుడు నవీన్ చంద్ర. కేవలం సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్‌‌లలోనూ నటిస్తూ.. ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్‌’ సినిమాతో తమిళ ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో వస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్ రిషి’. అమెజాన్ తమిళ్ ఒరిజినల్స్‌గా ఈ సిరీస్ ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతోంది.

Inspector Rishi: అమెజాన్ ప్రైమ్‌లో ‘ఇన్‌స్పెక్టర్ రిషి’.. ఎప్పుడంటే?
Naveen Chandra in Inspector Rishi

హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్.. ఇలా పాత్ర ఏదైనా నటుడిగా తన బాధ్యతను వందశాతం నిర్వహించే నటుడు నవీన్ చంద్ర (Naveen Chandra). కేవలం సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్‌‌లలోనూ నటిస్తూ.. ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. తెలుగులో మంచి గుర్తింపు అందుకున్న నవీన్ చంద్ర.. ఇటీవల ‘జిగర్తాండ డబుల్ ఎక్స్‌’ (Jigarthanda DoubleX) సినిమాతో తమిళ ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యారు. దీంతో నేరుగా ఆయన లీడ్ రోల్‌లో కోలీవుడ్‌లోనూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందుతున్నాయి. ఈ క్రమంలో వస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్ రిషి’ (Inspector Rishi). అమెజాన్ తమిళ్ ఒరిజినల్స్‌గా ఈ సిరీస్ ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతోంది. (Amazon Prime Video)


Inspector-Rishi.jpg

హారర్ క్రైమ్ కథతో ‘ఇన్‌స్పెక్టర్ రిషి’ వెబ్ సిరీస్‌ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె ఎస్ (Nandini JS). మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి (Sukh Dev Lahiri) నిర్మించారు. ఎలాంటి క్లూ లేకుండా జరుగుతున్న హత్యలను ఇన్వెస్టిగేట్ చేసే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నవీన్ చంద్ర ఈ వెబ్ సిరీస్‌లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అంతు చిక్కని ఈ హత్యల వెనుక ఎవరున్నారు అనేది సస్పెన్స్, హారర్ అంశాలతో ఆసక్తికరంగా ఇందులో తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం, శ్రీకాంత్ దయాల్, కుమార్ వేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో నవీన్ చంద్ర ‘ఏలెవన్, సత్యభామ’ వంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. (Naveen Chandra in Inspector Rishi)


ఇవి కూడా చదవండి:

====================

*AM Rathnam: పవన్ కళ్యాణ్‌పై ‘హరిహర వీరమల్లు’ నిర్మాత పోస్ట్ వైరల్

*****************************

*Vishwak Sen: మా సినిమాని కూడా చూసి.. నలుగురు పెద్ద మనుషులు మాట్లాడండి

************************

*Kubera: శేఖర్ కమ్ములతో కింగ్ నాగ్ మంతనాలు.. ఫొటో వైరల్

*****************************

Updated Date - Mar 14 , 2024 | 04:40 PM