Kubera: శేఖర్ కమ్ములతో కింగ్ నాగ్ మంతనాలు.. ఫొటో వైరల్

ABN , Publish Date - Mar 14 , 2024 | 10:46 AM

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కుబేర’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మహా శివరాత్రికి విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ధనుష్ డిఫరెంట్ అవతార్ అందరినీ ఆశ్చర్యపరిచింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ అప్‌డేట్ వదిలారు. బ్యాంకాక్‌లో న్యూ షెడ్యూల్ ప్రారంభమైనట్లుగా తెలుపుతూ కొన్ని ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు.

Kubera: శేఖర్ కమ్ములతో కింగ్ నాగ్ మంతనాలు.. ఫొటో వైరల్
King Nagarjuna and Sekhar Kammula

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ (Dhanush), కింగ్ నాగార్జున (King Nagarjuna) అక్కినేని, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కుబేర’ (Kubera). ఈ చిత్ర ఫస్ట్ లుక్ మహా శివరాత్రికి విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ధనుష్ డిఫరెంట్ అవతార్ అందరినీ ఆశ్చర్యపరిచింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ అప్‌డేట్ వదిలారు. బ్యాంకాక్‌లో న్యూ షెడ్యూల్ ప్రారంభమైనట్లుగా తెలుపుతూ కొన్ని ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు. (Kubera Movie Update)

నాగార్జునతో పాటు మరికొందరు నటీనటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కొంత టాకీ, యాక్షన్ పార్ట్‌‌ను చిత్రీకరించనున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ఇంతకు ముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో నాగార్జున, శేఖర్ కమ్ముల మంతనాలు జరుపుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వండర్ ఫుల్ వ్యూని గమనించవచ్చు. భారీ అంచనాలున్న ఈ సినిమా లావిష్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోంది. (Kubera New Shooting Schedule Stars in Bangkok)


Sekhar.jpg

శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఆసియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతం సమకూర్చుతుండగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Mahesh Babu: చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వాను

***************************

*Manchu Manoj: కవల పిల్లలపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్.. ట్విస్ట్ ఏమిటంటే?

**************************

Updated Date - Mar 14 , 2024 | 10:46 AM