AM Rathnam: పవన్ కళ్యాణ్‌పై ‘హరిహర వీరమల్లు’ నిర్మాత పోస్ట్ వైరల్

ABN , Publish Date - Mar 14 , 2024 | 02:52 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘ఖుషి’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఏఎమ్ రత్నం.. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రజా సేవయే ధ్యేయంగా సిద్ధాంత పరమైన ఆశయాలతో, ధృఢసంకల్పంతో నిర్మించిన జనసేన పార్టీ దశాబ్ద కాలం పూర్తి చేసుకొని, పదకొండవ సంవత్సరం‌లోకి ప్రవేశించిన తరునాణ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

AM Rathnam: పవన్ కళ్యాణ్‌పై ‘హరిహర వీరమల్లు’ నిర్మాత పోస్ట్ వైరల్
Producer AM Rathnam with Power Star Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘ఖుషి’ (Kushi) చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఏఎమ్ రత్నం.. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రజా సేవయే ధ్యేయంగా సిద్ధాంత పరమైన ఆశయాలతో, ధృఢసంకల్పంతో నిర్మించిన జనసేన పార్టీ దశాబ్ద కాలం పూర్తి చేసుకొని, పదకొండవ సంవత్సరం‌లోకి ప్రవేశించిన తరునాణ జనసేన (Janasena) అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. (Producer AM Rathnam)

‘‘ప్రజా సేవయే ధ్యేయంగా సిద్ధాంతపరమైన ఆశయాలతో, ధృఢసంకల్పంతో నిర్మించిన జనసేన పార్టీ దశాబ్ద కాలం పూర్తి చేసుకుని, పదకొండవ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజా సేవ మార్గంలో ఆయన ప్రయాణం దిగ్విజయంగా ముందుకు సాగాలని, ప్రజలకు మేలు జరగాలని, ఆయన కోరిక నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా జనసైనికులకు, వీర మహిళలకు శుభాకాంక్షలు..’’ అని ఏఎం రత్నం తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఓ పిక్‌ని కూడా పోస్ట్ చేశారు. (Janasena Formation Day)


Kalyan.jpg

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) హీరోగా ఏఎం రత్నం (AM Rathnam) ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకుడు. ఈ సినిమా దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో.. ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.


ఇవి కూడా చదవండి:

====================

*Vishwak Sen: మా సినిమాని కూడా చూసి.. నలుగురు పెద్ద మనుషులు మాట్లాడండి

************************

*Kubera: శేఖర్ కమ్ములతో కింగ్ నాగ్ మంతనాలు.. ఫొటో వైరల్

*****************************

*Mahesh Babu: చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వాను

***************************

Updated Date - Mar 14 , 2024 | 02:52 PM