scorecardresearch

Vishwak Sen: మా సినిమాని కూడా చూసి.. నలుగురు పెద్ద మనుషులు మాట్లాడండి

ABN , Publish Date - Mar 14 , 2024 | 01:13 PM

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు కార్తికేయ విడుదల చేసిన ‘ప్రేమలు’ సినిమాపై మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇన్ డైరెక్ట్‌గా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మా ‘గామి’ సినిమాను కూడా ఓ నలుగురు పెద్ద మనుషులు చూసి.. సినిమా గురించి మాట్లాడితే బాగుంటుంది.. ఇది మన తెలుగు సినిమా.. అంటూ విశ్వక్ సేన్ తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్‌లో హాట్‌హాట్‌గా డిస్కషన్స్ జరుగుతున్నాయి.

Vishwak Sen: మా సినిమాని కూడా చూసి.. నలుగురు పెద్ద మనుషులు మాట్లాడండి
Vishwak Sen

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తనయుడు కార్తికేయ (Karthikeya) విడుదల చేసిన ‘ప్రేమలు’ (Premalu) సినిమాపై మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) ఇన్ డైరెక్ట్‌గా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మా ‘గామి’ (Gaami) సినిమాను కూడా ఓ నలుగురు పెద్ద మనుషులు చూసి.. సినిమా గురించి మాట్లాడితే బాగుంటుంది.. ఇది మన తెలుగు సినిమా.. అంటూ విశ్వక్ సేన్ తిరుపతి (Tirupati)లో జరిగిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్‌లో హాట్‌హాట్‌గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ‘గామి’ సినిమా మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయంటూ.. మేకర్సే స్వయంగా రోజూ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. మరి ఎందుకు విశ్వక్ సేన్ ఇంతగా ప్రాధేయపడుతున్నాడంటూ.. సినీ పెద్దలు కొందరు మాట్లాడుకుంటున్నారు.

అసలు విశ్వక్ సేన్ ఏమన్నాడంటే..

‘‘గామి సినిమాను ఆదరిస్తున్న, హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కమర్షియల్‌గా మంచి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. చాలా రిస్క్ చేసి.. సుమారు ఆరేళ్లు కష్టపడి ఈ సినిమా తీశాం. మాకు సపోర్ట్ చేయకపోయినా పరవాలేదు కానీ.. బ్యాడ్‌గా రివ్యూలు ఇస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారో నాకు తెలియదు. పట్టించుకునేంత టైమ్ కూడా నాకు లేదు. మా సినిమాని కూడా నలుగురు పెద్ద మనుషులు చూసి.. కాస్త మాట్లాడితే బాగుంటుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే.. ఇది మన తెలుగు సినిమా. టాలీవుడ్‌లో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదని గర్వంగా చెప్పగలను. ఇంకో 10, 20 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి సినిమా ఒకటుందని అంతా మాట్లాడుకుంటారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు..’’ అని విశ్వక్ ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు. (Vishwak Sen Comments)


Gaami-Pic.jpg

సినిమా కమర్షియల్ హిట్ అయిందని చెబుతూనే.. మళ్లీ నలుగురు పెద్ద మనుషులు అనడం ఏంటనేది విశ్వక్‌కే తెలియాలి. మరో వైపు ఈ సినిమాతో పాటే విడుదలైన ‘ప్రేమలు’ చిత్రం (Premalu Movie) కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమాపై ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli), మహేష్ బాబు (Mahesh Babu), అనిల్ రావిపూడి (Anil Ravipudi) వంటి వారంతా సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. దీనిపైనే విశ్వక్ సేన్ ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Kubera: శేఖర్ కమ్ములతో కింగ్ నాగ్ మంతనాలు.. ఫొటో వైరల్

*****************************

*Mahesh Babu: చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వాను

***************************

Updated Date - Mar 14 , 2024 | 01:13 PM