Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఓటీటీలోకి వచ్చే డేట్ ఫిక్స్

ABN , Publish Date - Jan 14 , 2024 | 04:59 PM

నితిన్ హీరోగా నటించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్సయింది. డిసెంబర్ 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందననే రాబట్టుకుంది. అయితే ఈ సినిమాని ఓటీటీలో వీక్షించేందుకు మాత్రం వీక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారిందరి కోసం ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ నెల 19 నుండి స్ట్రీమింగ్‌కు సిద్ధం చేస్తోంది.

Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఓటీటీలోకి వచ్చే డేట్ ఫిక్స్
Nithiin and Sreeleela

నితిన్ (Nithiin) హీరోగా నటించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) డిజిటల్ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్సయింది. డిసెంబర్ 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందననే రాబట్టుకుంది. అయితే ఈ సినిమాని ఓటీటీలో వీక్షించేందుకు మాత్రం వీక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేస్తున్న వారికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus HotStar) సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాని డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కి ఉంచబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జూనియర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చిన అభినయ్ అనే ఓ కుర్రాడు హీరోగా ఎదిగేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది ఈ సినిమా కథ. తనకు తెలియకుండానే తన కోసం అనుకున్న ఓ కథలో హీరోగా వెళ్లిన అభినయ్.. ఎలా ప్రజల ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేశాడు అనేది ఇందులో మెయిన్ కథాంశం. కామెడీ, హారిస్ జయరాజ్ మ్యూజిక్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో మరింత మంది ఆడియెన్స్‌కు చేరువవుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది.


OTT-Extra-Ordinary-Man.jpg

శ్రేష్ట్ మూవీస్, రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో రూపుదిద్దుకుందీ చిత్రం. శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించగా.. ఇతర కీలక పాత్రల్లో రాజశేఖర్, రావు రమేష్, బ్రహ్మాజీ, సంపత్ రాజ్ తదితరులు కనిపిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత స్ట్రీమింగ్‌కి వస్తున్న ఈ చిత్రం.. ప్రేక్షకులకు కాలక్షేపంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


ఇవి కూడా చదవండి:

====================

*Guntur Kaaram: రెండో రోజూ రమణగాడు రాంప్ ఆడేశాడు.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

****************************

*నిర్మాత వివేక్ కూచిభొట్ల‌ను బెదిరిస్తోన్న సినీ రచయితపై కేసు నమోదు

************************

*‘హను-మాన్’కు థియేటర్లు ఇవ్వని వారిపై TFPC సీరియస్

***********************

*Guntur Kaaram: ‘గుంటూరు కారం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇది, మహేష్ బాబు స్టామినా!

**************************

*Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ అప్డేట్ కూడా వచ్చేసింది

************************

Updated Date - Jan 14 , 2024 | 04:59 PM