మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sasivadane: ‘వెతికా నిన్నిలా.. క‌నుపాప‌ల్లో క‌ల‌లా’.. మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేలా ‘శశివదనే’ పాట

ABN, Publish Date - Apr 10 , 2024 | 07:12 PM

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ‘వెతికా నిన్నిలా...’ పాటను మేకర్స్ విడుదల చేశారు.

Sasivadane Movie Still

‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి (Rakshit Atluri), కోమలీ ప్రసాద్ (Komalee Prasad) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’ (Sasivadane). గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన (SaiMohan Ubbana) దర్శకత్వం వ‌హించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’, ‘గోదారి అటువైపో..’ పాట‌లు, అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్రం నుంచి ‘వెతికా నిన్నిలా...’ పాటను మేకర్స్ విడుదల చేశారు.

*OTT: ఓటీటీలో.. స్ట్రీమవుతున్న‌ అదిరిపోయే క్రైమ్ ఇన్వెష్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్‌! డోంట్ మిస్‌


‘వెతికా నిన్నిలా.. క‌నుపాప‌ల్లో క‌ల‌లా

వెతికా నిన్నిలా.. వెతికా వెతికా...’’ (Sasivadane Vethika Ninnila Song) అంటూ స‌త్య‌యామిని పాడిన ఈ పాట విన‌గానే ఆక‌ట్టుకుంటోంది. ఈ పాటకు శ‌ర‌వ‌ణ భాస్క‌ర‌న్‌ సంగీతం అందించగా.. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించారు. హీరో, హీరోయిన్‌కి మ‌ధ్య అనుకోకుండా ఎడ‌బాటు వ‌చ్చింద‌ని, అత‌ని కోసం ఆమె త‌ప‌న ప‌డింద‌ని ఈ పాట‌ను విన్న‌వారికి ఎవ‌రికైనా ఇట్టే అర్థ‌మైపోతుంది. వెతికా నిన్నిలా.. క‌నుపాప‌ల్లో క‌ల‌లా... అంటూ సాగే హుక్ లైన్ ఈ పాట‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేలా చేస్తుంద‌ని అంటున్నారు శ‌శివ‌ద‌నే మేక‌ర్స్. శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!

*********************

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

Updated Date - Apr 10 , 2024 | 07:12 PM