Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!

ABN , Publish Date - Apr 10 , 2024 | 04:23 PM

రీసెంట్‌గా జరిగిన ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ‘దేవర’ను ఉద్దేశించి ‘దేవర’ నామ సంవత్సరం మొదలైందని అన్నారు. అన్నట్లుగానే.. నిజంగానే ఈ సంవత్సరం ‘దేవర’ నామ సంవత్సరంగా మారబోతుంది. ‘దేవర’ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో మరోసారి ‘దేవర’ చిత్రం వార్తలలో హైలెట్ అవుతోంది.

Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!
Young Tiger NTR in Devara

రీసెంట్‌గా జరిగిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram).. ‘దేవర’ (Devara)ను ఉద్దేశించి ‘దేవర’ నామ సంవత్సరం మొదలైందని అన్నారు. అన్నట్లుగానే.. నిజంగానే ఈ సంవత్సరం ‘దేవర’ నామ సంవత్సరంగా మారబోతుంది. ఆయన అలా అన్నారో లేదో.. ఇప్పుడు ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చేసింది. ‘దేవర’ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ని (North India Theatrical Distribution Rights) బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions) సొంతం చేసుకుంది. దీంతో మరోసారి ‘దేవర’ చిత్రం వార్తలలో హైలెట్ అవుతోంది.

*Trivikram Srinivas: ‘దేవర’ నామ సంవత్సరం.. 100 పక్కన ఇంకో సున్నాతో మొదలవ్వాలి

ధర్మ ప్రొడక్షన్స్.. విషయానికి వస్తే.. గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రాన్ని నార్త్‌లో విడుదల చేసింది ఈ సంస్థే. కరణ్ జోహార్‌ (Karan Johar)కి చెందిన ఈ నిర్మాణ సంస్థ.. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్‌ని ఒక్కసారిగా ‘బాహుబలి’తో సొంతం చేసుకుంది. ఇప్పుడీ సంస్థ.. ‘దేవర’ రైట్స్ (Devara Rights) కోసం క్యూ కట్టి మరీ సొంతం చేసుకుందంటే.. ఇక నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్స్, ప్రమోషన్స్ అన్నీ ఈ సంస్థ పక్కాగా ప్లాన్ చేస్తుంది. ‘బాహుబలి’ సినిమాను కరణ్ జోహార్ అండ్ టీమ్ ఎలా పబ్లిక్‌లోకి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.


devara.jpg

అయితే ఈ సంస్థతో చిన్న ప్రాబ్లమ్ కూడా ఉంది. అది ఏంటంటే.. ఈ సంస్థలో విడుదలయ్యే సినిమాలన్నింటికీ ఈ మధ్య ఓ ట్యాగ్ వైరల్ అవుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ మృతి తర్వాత ఈ సంస్థ నుండి వచ్చే ప్రతి సినిమా ‘బ్యాన్’, ‘బాయ్ కాట్’ ట్యాగ్స్‌ని ఫేస్ చేస్తున్నాయి. ఈ సమస్యని కనుక జయిస్తే.. ‘దేవర’కు ఇక నార్త్ బెల్ట్‌లో తిరుగులేనట్లే. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌తో కలిసి ఈ సంస్థే నిర్మించింది. కరణ్ జోహార్‌పై ఉన్న వ్యతిరేకత ఏంటనేది ‘లైగర్’ (Liger) సినిమా విషయంలో అందరికీ తెలిసింది. కాగా, ఏఏ ఫిల్మ్స్ ఇండియాతో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ‘దేవర’ సినిమాను హిందీ బెల్ట్‌లో విడుదల చేయనుంది.

మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ (Man of the Masses Young Tiger NTR), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), శృతి మరాఠే (Shruti Marathe) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

Updated Date - Apr 10 , 2024 | 04:48 PM