Matka: మ్యాసీవ్ సెట్‌‌లో ‘మట్కా’ మూవీ షూటింగ్

ABN , Publish Date - Jun 07 , 2024 | 05:58 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న పాన్-ఇండియన్ మూవీ ‘మట్కా’. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రజనీ తాళ్లూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ మూవీని హ్యుజ్ కాన్వాస్‌పై హైబడ్జెట్, టాప్ టెక్నికల్ వేల్యూస్‌‌తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర కొత్త షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు.

Matka: మ్యాసీవ్ సెట్‌‌లో ‘మట్కా’ మూవీ షూటింగ్
Varun Tej in Matka

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) నటిస్తోన్న పాన్-ఇండియన్ మూవీ ‘మట్కా’ (Matka). ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రజనీ తాళ్లూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ మూవీని హ్యుజ్ కాన్వాస్‌పై హైబడ్జెట్, టాప్ టెక్నికల్ వేల్యూస్‌‌తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర కొత్త షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించి మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు. జూన్ 19 నుంచి ఈ చిత్ర నూతన షెడ్యూల్ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు.

ప్రస్తుతం ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో మ్యాసీవ్ సెట్‌ (Massive Set in Hyderabad)ను నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ (Varun Tej) 4 డిఫరెంట్ గెటప్‌లలో కనిపించనున్న ఈ చిత్రంలో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. యావత్ దేశాన్ని కదిలించిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా కథ డిఫరెంట్ టైమ్స్‌లో సెట్ చేయబడిందని.. త్వరలో మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ని తెలియజేస్తామని మేకర్స్ చెబుతున్నారు.

Also Read- Pawan Kalyan: పవర్ స్టార్ నిజజీవితంలో కూడా పవర్ ఫుల్, హోమ్ మినిస్టర్?


Matka-Varun-Tej.jpg

ఈ సినిమాకు సంబంధించి వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ వదిలిన టీజర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ టీజర్ సినిమా ప్రిమైజ్‌ని అద్భుతంగా చూపింది. నవీన్ చంద్ర (Naveen Chandra), పి రవి శంకర్ వంటి కొన్ని ముఖ్యమైన పాత్రలను కూడా ఇందులో పరిచయం చేశారు. కాగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 07 , 2024 | 05:58 PM