Matka: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్ వీడియో

ABN, Publish Date - Jan 19 , 2024 | 12:12 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ‘పలాస, శ్రీదేవి సోడా సెంటర్’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ చిత్రంతో పాన్ ఇండియన్ అరంగేట్రం చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి (సివిఎం) భారీ కాన్వాస్‌పై హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా వరుణ్ తేజ్ బర్త్‌డేని పురస్కరించుకుని ఓపెనింగ్ బ్రాకెట్ పేరుతో ఓ వీడియోని మేకర్స్ విడుదల చేశారు.