Matka: వరుణ్‌తేజ్‌ కోసం.. జీవీ ప్రకాష్‌

ABN , Publish Date - Jan 04 , 2024 | 04:31 PM

జీవీ ప్రకాష్‌కుమార్‌.. సంగీత దర్శకుడిగానే కాక, హీరోగానూ బిజీగా గడుపుతున్నారు. వైవిధ్యమైన చిత్రాలకు సంగీతం అందించడమే కాకుండా సెలెక్టవ్‌ కథలతో హీరోగానూ దూసుకెళ్తున్నాడు. తెలుగు సినిమా విషయంలో దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌ హవాలో అప్పుడప్పుడూ జీవీ ప్రకాష్‌కుమార్‌ పేరు కూడా వినిపిస్తుంది.

Matka: వరుణ్‌తేజ్‌ కోసం.. జీవీ ప్రకాష్‌

జీవీ ప్రకాష్‌కుమార్‌.. (Gv prakash) సంగీత దర్శకుడిగానే కాక, హీరోగానూ బిజీగా గడుపుతున్నారు. వైవిధ్యమైన చిత్రాలకు సంగీతం అందించడమే కాకుండా సెలెక్టవ్‌ కథలతో హీరోగానూ దూసుకెళ్తున్నాడు. తెలుగు సినిమా విషయంలో దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌ హవాలో అప్పుడప్పుడూ జీవీ ప్రకాష్‌కుమార్‌ పేరు కూడా వినిపిస్తుంది. గత ఏడాది 'సూరారై పోట్రు' చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. తాజాగా వరుణ్‌ తేజ్‌(varun tej) ‘మట్కా’కు (matka)సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. 'పలాస’తో ఆకట్టుకొన్న కరుణ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లింది. వైరా మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా నిర్మిస్తోంది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నాయికలు.

హీరోగా అయిన, సంగీత దర్శకుడిగా అయినా కథల విషయంలో ఆచితుచి వ్యవహరిస్తుంటారు జీవీ. ఆయన సంగీతం అందించిన సినిమా పరాజయం అయి ఉండొచ్చు కానీ ఆయన సంగీతం ఎక్కడా ఫెయిల్‌ కాలేదు. గడిచిన ఏడాది విడుదలైన ‘టైగర్‌ నాగేశ్వరరావు’కి ఆయనే సంగీతం అందించారు. పాటలు సోసోగా ఉన్నా బ్యాగ్రౌండ్‌ స్కోర్‌లో తన మార్క్‌ చూపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సన్నివేశాల్ని బాగా ఎలివేట్‌ చేస?్తడు. అందుకే మట్కా చిత్రానికి జీవీని ఎంపిక చేశారని తెలుస్తోంది.

Updated Date - Jan 04 , 2024 | 04:32 PM