Varun Tej: వరుణ్ తేజ్ ‘మట్కా’ అప్‌డేట్

ABN , First Publish Date - 2023-11-26T15:37:45+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మళ్లీ యాక్షన్ లోకి దిగుతున్నారు. ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం ‘మట్కా’ రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుందని తాజాగా మేకర్స్ తెలియజేశారు.

Varun Tej: వరుణ్ తేజ్ ‘మట్కా’ అప్‌డేట్
Mega Prince Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) మళ్లీ యాక్షన్ లోకి దిగుతున్నారు. ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్‌ (Karuna Kumar)తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం ‘మట్కా’ (Matka) రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌(Vyra Entertainments)పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుందని తాజాగా మేకర్స్ తెలియజేశారు.

VT-1.jpg

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌తో టీమ్ బిజీగా ఉంది. 1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందించారు. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్‌ సిటీని తలపించే భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను వుంటాయని.. నలుగురు ఫైట్ మాస్టర్‌లు యాక్షన్‌ని పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. (Matka Update)


VT-2.jpg

24 ఏళ్ల స్పాన్ కలిగిన కథలో వరుణ్ తేజ్ (Varun Tej) నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు. వరుణ్ తేజ్‌కు హయ్యస్ట్ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా ఉండే ఈ సినిమా కోసం వరుణ్ పూర్తి మేకోవర్ అవుతున్నారు. వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి (Nora Fatehi), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సౌత్‌లో అత్యంత బిజీగా ఉన్న కంపోజర్‌లలో ఒకరైన జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, ఆశిష్ తేజ ప్రొడక్షన్ డిజైనర్, సురేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Sandeep Reddy Vanga: పక్కా తెలంగాణ బిడ్డని.. ఆ రోజులు తలుచుకుంటే భయమేస్తుంది

******************************

*Geethanjali Sequel: ‘గీతాంజలి’తో అంజలి మళ్లీ వస్తోంది

******************************

*Sandeep Reddy Vanga: మహేష్ బాబుకి ఒక కథ చెప్పా.. కానీ?

******************************

*Srikanth: ఈ మ‌ధ్య‌కాలంలో నాకు ఏ చిత్రానికి ఇన్ని ప్ర‌శంస‌లు రాలేదు

*******************************

*Sandeep Reddy Vanga: నటసింహం బాలయ్యకి ఫ్యాన్ అయిపోయా..

********************************

Updated Date - 2023-11-26T15:37:46+05:30 IST