Trivikram Srinivas: ‘దేవర’ నామ సంవత్సరం.. 100 పక్కన ఇంకో సున్నాతో మొదలవ్వాలి

ABN , Publish Date - Apr 09 , 2024 | 04:19 PM

టిల్లు స్క్వేర్‌తో 100 కోట్ల క్లబ్‌లో చేరిన సిద్ధుకి కంగ్రాట్స్. డీజే టిల్లు కంటే టిల్లు స్క్వేర్ పెద్ద హిట్ అయింది. ఈ సంవత్సరం అంటే మంగళవారం నుంచి దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను. ఈ 100 పక్కన ఇంకో సున్నా పెట్టి.. ఆయన దేవర మొదలు పెట్టాలని మీ అందరి తరపున మనందరి తరపున, ఎన్టీఆర్ కంటే కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తున్నానని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

Trivikram Srinivas: ‘దేవర’ నామ సంవత్సరం.. 100 పక్కన ఇంకో సున్నాతో మొదలవ్వాలి

2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ (Mallik Ram) దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాలతో మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి రూ.150 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం సోమవారం సాయంత్రం విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Trivikram.jpg

హైదరాబాద్, శిల్పకళా వేదికలో ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుక‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన సిద్ధుకి కంగ్రాట్స్. ఈ సినిమా టిల్లు స్క్వేర్ మాత్రమే కాదు రాధిక స్క్వేర్ కూడా. నాలుగు సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇంట్లో నాకు టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి నేను సిద్ధుని చూస్తున్నాను. దీని కోసం అతను పడిన కష్టం కానీ, డీజే టిల్లు డైరెక్ట్ చేసిన విమల్ కానీ, టిల్లు స్క్వేర్ డైరెక్ట్ చేసిన మల్లిక్ కానీ.. వాళ్లు మొత్తం టిల్లు తప్ప ఇంకా ఏమీ పని లేనట్టుగా పనిచేశారు. అందుకే ఇంత పెద్ద సక్సెస్ కనిపిస్తోంది. వంశీ, చినబాబు గారు సిద్ధూని, ఆ టీంని నమ్మారు. అందుకే డీజే టిల్లు కంటే టిల్లు స్క్వేర్ పెద్ద హిట్ అయింది. ఈ సంవత్సరం అంటే మంగళవారం నుంచి ‘దేవర’ (Devara) నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను. ఈ 100 పక్కన ఇంకో సున్నా పెట్టి.. ఆయన దేవర మొదలు పెట్టాలని మీ అందరి తరపున మనందరి తరపున, ఎన్టీఆర్ కంటే కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. ఈ టీం అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.. అని అన్నారు. (Trivikram Srinivas Speech at Tillu Square Success Meet)

*NTR: ‘దేవ‌ర‌’.. ప్ర‌తి అభిమాని కాల‌ర్ ఎగ‌రేసేలా ఉంటుంది! ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన ఎన్టీఆర్‌


Vishwak-Sen.jpg

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Maa ka Das Vishwak Sen) మాట్లాడుతూ.. నేను ఈ వేడుకకు రావడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ (NTR) అన్నను చూడొచ్చని. అన్నను చూస్తే నాకు మాటలు కూడా రావు. లవ్ యూ ఎన్టీఆర్ అన్న. చెప్పి కొట్టడంలో కిక్ ఉంటుంది. సిద్ధు చెప్పి మరీ ఈ విజయం సాధించాడు. ఈ సినిమాని సిద్ధు ఎంత నమ్మాడో నాకు తెలుసు. ఎప్పుడూ ఈ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వేరే సినిమాలు కూడా చేయకుండా ఈ చిత్రం కోసం ఎక్కువ సమయం కేటాయించాడు. ఒక సినిమాకు అంత టైం కేటాయించడం నిజంగా గ్రేట్. టిల్లు పాత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది. వంశీ గారికి, చినబాబు గారికి కంగ్రాట్స్. ఇంతటి విజయాన్ని సాధించిన చిత్ర బృందానికి నా శుభాకాంక్షలని తెలిపారు.

Tarak.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

*Sunny Leone: పెళ్లికి ముందే.. సన్నీ లియోన్ జీవితంలో అత్యంత దారుణమైన సంఘటన!

***********************

*Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిజల్ట్‌పై దిల్ రాజు స్పందనిదే..

*************************

Updated Date - Apr 10 , 2024 | 04:22 PM