Jr NTR: ’దేవ‌ర‌‘.. ప్ర‌తి అభిమాని కాల‌ర్ ఎగ‌రేసేలా ఉంటుంది! ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించిన ఎన్టీఆర్‌

ABN , Publish Date - Apr 08 , 2024 | 09:06 PM

రానున్న దేవ‌ర సినిమా రిలీజ్ లేటైనా.. ప్ర‌తి అభిమాని త‌మ కాల‌ర్ ఎగ‌రేసేలా ఉంటుంద‌ని మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియ‌ర్ ఎన్టీఆర్ అన్నారు.

Jr NTR: ’దేవ‌ర‌‘.. ప్ర‌తి అభిమాని కాల‌ర్ ఎగ‌రేసేలా ఉంటుంది! ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించిన ఎన్టీఆర్‌
ntr

రానున్న నా దేవ‌ర సినిమా లేటైనా.. ఫ‌ర్లేదు కానీ ప్ర‌తి అభిమాని త‌మ కాల‌ర్ ఎగ‌రేసేలా ఉంటుంద‌ని మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియ‌ర్ ఎన్టీఆర్ అన్నారు. ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి వంద కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి సంచ‌ల‌న విజ‌యం సాధించిన డీజే టిల్లు స‌క్సెస్ మీట్ (TilluSquareSucessMeet) సోమ‌వారం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr NTR)తో పాటు తివిక్ర‌మ్ శ్రీనివాస్‌, విశ్వ‌క్ సేన్ ముఖ్య అతిథులుగా హ‌జ‌ర‌య్యారు.

GKpjXqZaoAAnd_d.jpeg

ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ (Jr NTR) మాట్లాడుతూ.. నేను మిమ్మ‌ల్ని క‌ల‌వ‌క‌ముందుగా అభిమానులకు, మీడియా వారికి న‌మ‌స్కారాలు తెలియ‌జేసి త‌న ప్ర‌సంగాన్ని స్టార్ట్ చేశారు. సిద్దూవి చాలా సినిమాలు చూశాను గానీ ఎప్పుడు వ్య‌క్తిగ‌తంగా క‌ల‌వ‌లేద‌ని , సిద్దు లాంటి వ్య‌క్తులు ఈ ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ మంది ఉంటార‌ని సినిమా అంటే అత‌నికి అంత పిచ్చి అని అన్నారు. టామ్ జెర్రీ,హిమాన్ వంటి క్యారెక్ట‌ర్స్ మ‌న జీవితంలో ఎలా మిగిలాయో డీజే టిల్లు కూడా ఆ లిస్టులో చేరింద‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr NTR) అన్నారు.


ఇప్పుడు డీజే టిల్లు లాంటి క్యారెక్ట‌ర్ మ‌న‌లో ఒక‌టిగా , ప్ర‌తి ఇంటి మ‌నిషిగా తీర్చి దిద్దార‌ని ఆ క్యారెక్ట‌ర్‌తో మంచి వినోదాన్ని అందించార‌ని, నేను ఓ ప‌ట్టాన మొద‌లు పెడితే న‌వ్వు ఆప‌న‌ని.. అది ఈ సినిమా విష‌యంలో జ‌రిగింద‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr NTR) అన్నారు. అదుర్స్‌, అర‌వింద స‌మేత స‌మ‌యంలో కామెడీ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణప్పుడే ఇలానే న‌వ్వాన‌ని అన్నారు.

GKps_ZtXgAEfszL.jpeg

విశ్వ‌క్‌, సిద్దులు మ‌న టాలీవుడ్ భ‌విష్య‌త్‌ను మార్చేస్తార‌ని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాన‌ని.. వాళ్లు ఇలాగే వారు ప‌ని చేసుకుంటూ వెళ్లాల‌ని అన్నారు. డీజే టిల్లు విజ‌యంలో రాధిక పాత్ర‌లు ముఖ్య పాత్ర‌లు పోషించియ‌న్నారు. ఇక చివ‌ర‌గా రానున్న నా దేవ‌ర సినిమా రిలీజ్ లేటైనా.. కానీ ప్ర‌తి అభిమాని త‌మ కాల‌ర్ ఎగ‌రేసేలా ఉంటుంద‌ని అది నా గ్యారంటీ అని జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr NTR) చెబుతూ అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు.

Updated Date - Apr 08 , 2024 | 09:15 PM