Seetha Kalyana Vaibhogame: అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘సీతా కళ్యాణ వైభోగమే’

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:40 AM

సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

Seetha Kalyana Vaibhogame: అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘సీతా కళ్యాణ వైభోగమే’
Seetha Kalyana Vaibhogame Movie Team

సుమన్ తేజ్ (Suman Tej), గరీమ చౌహన్ (Garima Chauhan) హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద (Satish Paramaveda) దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’ (Seetha Kalyana Vaibhogame). ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా హీరో సుమన్ తేజ్ మాట్లాడుతూ.. కొత్త హీరోని నమ్మి సినిమా తీయడం అంత ఈజీ కాదు. మా మీద నమ్మకంతో చిత్రాన్ని తీసిన నిర్మాత రాచాల యుగంధర్‌కి థాంక్స్. గరీమ చౌహాన్ చక్కగా నటించారు. మా దర్శకుడు సతీష్ గారు అన్ని అంశాలను కలగలపి మంచి కమర్షియల్ సినిమాను తీశారు. గగన్ విహారి చాలా వైల్డ్‌గా నటించారు. సంగీతం, కెమెరా వర్క్ అద్భుతంగా ఉంటుంది. మా ఫ్యాషన్ పార్ట్నర్స్ అయిన నీరుస్‌కు థాంక్స్. మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరించాలని కోరారు. హీరోయిన్ గరీమ చౌహాన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న ప్రేమకు థాంక్స్. నాకు ఇదే మొదటి చిత్రం. ఇక్కడ అందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మహిళలకు తగిన ప్రాధాన్యం, గౌరవం ఇవ్వాలని చెప్పే సినిమా ఇది. మా మూవీని చూసి అందరూ ఆదరించండని అన్నారు. నటుడు గగన్ విహారి మాట్లాడుతూ.. ధర్మపురితో హీరోగా నాకు మంచి పేరు వచ్చింది. దర్శకుడు సతీష్ గారు సీతా కళ్యాణ వైభోగమే కథ చెప్పారు. టైటిల్ వింటేనే ఎంతో హాయిగా అనిపించింది. రాముడు, సీత అనే కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రాన్ని తీశారు. ఇందులో నేను చాలా వైల్డ్‌గా కనిపిస్తాను. మా చిత్రాన్ని ప్రేక్షకులు చూసి సక్సెస్ చేయాలని అన్నారు. (Seetha Kalyana Vaibhogame Ready to Release)


seetha.jpg

దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. నా మొదటి సినిమా ‘ఊరికి ఉత్తరాన’. ఆ చిత్రానికి యుగంధర్ గారు సహ నిర్మాత. మళ్లీ ఆయనతోనే రెండో సినిమాను తీయడం ఆనందంగా ఉంది. రామాయణాన్ని ఆధారంగా తీసుకుని మళ్లీ మన విలువలు, సంప్రదాయాన్ని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తీశాను. మరిచిపోతోన్న విలువల్ని అందరికీ గుర్తు చేసేలా ఈ చిత్రం ఉంటుంది. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారని అన్నారు. నిర్మాత రాచాల యుగంధర్ (Rachala Yugandhar) మాట్లాడుతూ.. దర్శకుడు సతీష్ ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో యాక్షన్, లవ్, కుటుంబ విలువలు అన్నీ కలగలపి తీశాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. సుమన్ తేజ్, గరిమ చౌహాన్ కొత్త వాళ్లైనా అద్భుతంగా నటించారు. ధర్మపురి హీరో గగన్ విహారి (Gagan Vihari) ఈ సినిమాలో విలన్‌గా చక్కగా నటించారు. వందల మందితో పాటలు, ఫైట్లను భారీ ఎత్తున తీశాం. నీరుస్ యాజమాన్యం మాతో భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉంది. మీడియా మాకు ముందు నుంచీ సహకారం అందిస్తోంది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Pushpa 2 The Rule: 138 గంట‌ల‌పాటు ట్రెండింగ్‌లో.. సరికొత్త రికార్డ్

*********************************

*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్

**********************

Updated Date - Apr 15 , 2024 | 11:40 AM