2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా

ABN , Publish Date - Apr 15 , 2024 | 01:04 AM

తమిళనాట 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని హీరో విశాల్‌ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని, పొత్తు పెట్టుకోనని ఆయన స్పష్టం చేశారు...

2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా

తమిళనాట 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని హీరో విశాల్‌ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని, పొత్తు పెట్టుకోనని ఆయన స్పష్టం చేశారు. చెన్నైలో ఆదివారం తమిళ్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ (టీఎంజేఏ) ఆధ్వర్వ్యంలో నిర్వహించిన తమిళ ఉగాది వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు విశాల్‌ సమాధానమిస్తూ, 2026 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని చెప్పారు. ఒంటరిగానే బరిలోకి దిగుతానని తెలిపారు. ప్రజల్లో తానేంటో నిరూపించుకోకుండా పొత్తు ఎలా పెట్టుకుంటానని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో తాను మాత్రమే కాకుండా, చెన్నై లయోలా కాలేజీలో తనతో పాటు చదువుకుని సినీ స్టార్స్‌గా ఉన్న మరికొంతమంది కూడా ఎన్నికల బరిలోకి దిగుతారన్నారు. అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరుగుతాయా? ముందుగానే జరుగుతాయా? అన్నది తనకు తెలియదన్నారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమన్నారు. తన అభిమాన నటుడు విజయ్‌ అని, ఆయన్ను డైరెక్ట్‌ చేయాలని ఉందన్నారు.

ఆంధ్రజ్యోతి, చెన్నై

Updated Date - Apr 15 , 2024 | 01:04 AM