Sahkutumbanaam: స్వచ్చమైన తెలుగింటి టైటిల్‌

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:27 AM

మహాదేవ గౌడ్‌ (Mahadeva goud) నిర్మిస్తున్న సినిమా ‘సఃకుటుంబానాం’(Sahkutumbanaam) హెచ్‌ ఎన్‌ జి సినిమాస్‌ బ్యానర్‌పై ఉదయ్‌ శర్మ రాచనా, దర్శకత్వం చేయగా, రామ్‌ కిరణ్‌ (Ram kiran)హీరోగా  పరిచయం అవుతున్నారు.

Sahkutumbanaam: స్వచ్చమైన తెలుగింటి టైటిల్‌
Sahkutumbanaam movie first lookమహాదేవ గౌడ్‌ (Mahadeva goud) నిర్మిస్తున్న సినిమా ‘సఃకుటుంబానాం’(Sahkutumbanaam) హెచ్‌ ఎన్‌ జి సినిమాస్‌ బ్యానర్‌పై ఉదయ్‌ శర్మ రాచనా, దర్శకత్వం చేయగా, రామ్‌ కిరణ్‌ (Ram kiran)హీరోగా  పరిచయం అవుతున్నారు. మేఘా ఆకాష్‌ (Megha Akash) కథానాయిక. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. మహాదేవ గౌడ్‌ మాట్లాడుతూ "తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు చక్కని స్పందన వస్తోంది. టైటిల్‌ చూసి అచ్చమైన తెలుగింటి టైటిల్‌ అని చాలామంది మెచ్చుకున్నారు. రేషన్‌ కార్డు డిజైన్‌ లా ఉన్న పోస్టర్‌ బట్టి సినిమా కూడా మంచి క్రియేటివిటీతో   కుటుంబ కథా చిత్రం అవుతుంది అనేలా ఉంది. ముఖ్యంగా ఇంత మంచి కాంబినేషన్స్‌ రావడం చాలా సంతోషం. సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్‌, బ్రహ్మానందం, సత్య, రాజశ్రీ నాయర్‌, ధుభలేఖ సుధాకర్‌, తాగుబోతు రమేష్‌, నిత్యశ్రీ, రమేష్‌ భువనగిరి, శ్రీప్రియ తదితరులు నటిస్తున్నారు.  మణిశర్మ సంగీతం అందిస్తున్నారు’’ అని అన్నారు.

Saha.jpeg
"రేషన్‌ కార్డు లాగా ఉన్న ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకి మణిశర్మ గారు చాలా పెద్ద అసెట్‌. కంటెంట్‌ ని నమ్మి మాకు చాలా బాగా సపోర్ట్‌ చేశారు. రీసెంట్‌ గా ఇంత మంది ఆర్టిస్టులు ఇంత మంచి  కాంబినేషన్స్‌ తో ఏ సినిమా రాలేదు, కంటెంట్‌ బావుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. మా సినిమాలో మంచి కథ ఉంది’’ అని దర్శకుడు అన్నారు.

Vijayadevarakonda : ఈ ప్రచారాన్ని.. అరికట్టాల్సిందే!


Updated Date - Apr 13 , 2024 | 03:21 PM