Lucky Baskhar: ‘లక్కీ భాస్కర్’ మూవీ టీజర్

ABN, Publish Date - Apr 11 , 2024 | 09:14 PM

వివిధ భాషల్లో, విభిన్న సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఇప్పుడు ఆయన ‘లక్కీ భాస్కర్’ అనే బహుభాషా చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.