పాటలు ప్రత్యేకాకర్షణగా...

ABN , Publish Date - Apr 12 , 2024 | 05:32 AM

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్‌ కుమార్‌ మేగోటి దర్శకుడు. ఎం.ఎ్‌స.కె నిర్మాత. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు...

పాటలు ప్రత్యేకాకర్షణగా...

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్‌ కుమార్‌ మేగోటి దర్శకుడు. ఎం.ఎ్‌స.కె నిర్మాత. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. సంగీత దర్శకులు ఆర్‌ పీ పట్నాయక్‌, శ్రీలేఖ, రఘు కుంచె, ఘంటాడి కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక పీరియాడిక్‌ డ్రామా. అమ్మవారి భక్తురాలిని దుష్టశక్తుల బారి నుంచి కాపాడే క్షేత్రపాలకుడి కథ. ఐదు భాషల్లో రూపొందుతోంది’ అన్నారు. పాటలు చాలా బావున్నాయి, ఈ సినిమా విజయంలో పాటలు ముఖ్య పాత్ర పోషిస్తాయి అని అతిథులు పేర్కొన్నారు. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్‌ నోరానా కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Apr 12 , 2024 | 05:32 AM