హీరో రామ్‌ చరణ్‌కు ‘గౌరవ డాక్టరేట్‌’

ABN , Publish Date - Apr 12 , 2024 | 05:38 AM

హీరో రామ్‌చరణ్‌కు చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. చిత్రపరిశ్రమతో పాటు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా...

హీరో రామ్‌ చరణ్‌కు ‘గౌరవ డాక్టరేట్‌’

చెన్నై, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): హీరో రామ్‌చరణ్‌కు చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. చిత్రపరిశ్రమతో పాటు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నట్టు వేల్స్‌ విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 13 సాయంత్రం 4 గంటలకు చెన్నై పల్లావరంలోని వేల్స్‌ క్యాంపస్‌లో జరిగే యూనివర్శిటీ 14వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ టీజీ సీతారామ్‌ పాల్గొని ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తారు. ఈ స్నాతకోత్సవంలో రామ్‌ చరణ్‌తో పాటు చంద్రయాన్‌-3 ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ పి.వీరముత్తువేల్‌, త్రివిట్రన్‌ హెల్త్‌కేర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఫౌండర్‌ చైర్మన్‌ డాక్టర్‌ జీఎస్‌కే వేలు, టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ పద్మశ్రీ శరత్‌ కుమల్‌ అచంటలకు కూడా ఈ గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వేల్స్‌ యూనివర్శిటీ చాన్సెలర్‌ డాక్టర్‌ ఐసరి కె.గణేశ్‌ అధ్యక్షత వహించనున్నారు.

Updated Date - Apr 12 , 2024 | 05:38 AM