NBK109: బాలయ్య సినిమా నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్.. మాన్‌స్టర్ వచ్చేస్తున్నాడు

ABN , Publish Date - Jun 09 , 2024 | 06:18 PM

‘అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి’ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’తో సూపర్ సక్సెస్ కొట్టిన బాబీ దర్శకత్వంలో NBK109 చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా ఎన్నికల కారణంగా కొన్ని రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. బాలయ్య పుట్టినరోజు (జూన్ 10)ను పురస్కరించుకుని NBK109 టీమ్ ఓ బ్లాస్టింగ్ అప్‌డేట్‌‌తో సిద్ధమైంది.

NBK109: బాలయ్య సినిమా నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్.. మాన్‌స్టర్ వచ్చేస్తున్నాడు
NBK109 Movie Pic

‘అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి’ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య (Balayya).. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’తో సూపర్ సక్సెస్ కొట్టిన బాబీ (Bobby) దర్శకత్వంలో NBK109 చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా ఎన్నికల కారణంగా కొన్ని రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా జరిగిన ఏపీ ఎన్నికలలో కూడా బాలయ్య హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. ఇలా హ్యాట్రిక్‌ల అనంతరం మళ్లీ షూటింగ్‌తో బిజీ అవుతున్నారనేలా ఈ మధ్య వార్తలు వచ్చినా.. ఇంకా షూటింగ్‌లో అడుగుపెట్టలేదని స్వయంగా బాలయ్యే రీసెంట్‌గా జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో చెప్పుకొచ్చారు. ఇక బాలయ్య పుట్టినరోజు (జూన్ 10)ను పురస్కరించుకుని NBK109 టీమ్ ఓ బ్లాస్టింగ్ అప్‌డేట్‌‌తో సిద్ధమైంది. (Nandamuri Natasimha Balakrishna)

Also Read- Gangs Of Godavari OTT: డేట్ ఫిక్సయింది.. లంకల రత్నం జాతర ఇక ఓటీటీలో!

ఇంతకు ముందు మహాశివరాత్రి కానుకగా విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచగా.. ఇప్పుడు బాలయ్య బర్త్‌డే స్పెషల్‌గా (Balayya Birthday Special) మూవీ టీమ్ ఏం వదలబోతున్నారో అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ అప్‌డేట్‌కు సంబంధించి సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్, దర్శకుడు బాబీ, నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నెటిజన్లను, ఫ్యాన్స్‌ను సోషల్ మీడియాలో బాగా కవ్విస్తున్నారు. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తున్నారు. ఫైరింగ్ అప్‌డేట్, బ్లాస్టింగ్ అప్‌డేట్ అంటూ ఊరిస్తున్నారు. తాజాగా సితార సంస్థ ‘మాన్‌స్టర్’ (Monster)ని రివీల్ చేయబోతున్నామంటూ ఓ పోస్టర్ వదిలింది. (HBDNBK)


NBK.jpg

ఈ పోస్టర్‌లో బాలయ్య ఫేస్ కనిపించడం లేదు కానీ.. రెండు బ్యాగ్స్ పట్టుకుని నడిచివస్తున్నారు. ఈ పోస్టర్ పవర్‌ఫుల్‌గా ఉంది. అతను వస్తున్నాడు.. అని తెలుపుతూ.. సోమవారం (జూన్ 10) ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ‘మాన్‌స్టర్’ని రివీల్ చేయబోతున్నట్లుగా ఇందులో పేర్కొన్నారు. ప్రస్తుతం సితార బ్యానర్ నుంచి వచ్చిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. (NBK109 Movie Poster)

Read Latest Cinema News

Updated Date - Jun 09 , 2024 | 06:18 PM