NBK109: బాలకృష్ణ సినిమాలో ఊర్వశి రౌటేలా పాత్ర ఇదే

ABN , Publish Date - Feb 01 , 2024 | 01:47 PM

నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కొల్లి తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, ఇంతకీ ఆమె పాత్ర ఏంటి అనేది ఆమె చెప్పేసారు.

NBK109: బాలకృష్ణ సినిమాలో ఊర్వశి రౌటేలా పాత్ర ఇదే
Urvashi Rautela reveals her role from NBK109

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న NBK109 సినిమాలో ఊర్వశి రౌటేలా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె కథానాయకురాలిగా చేస్తున్నట్టుగా ఆమె కొన్ని మీడియాలతో మాట్లాడుతూ చెప్పారు కూడా. అయితే ఆమె ఈరోజు తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. అందులో NBK109 సినిమాలో తాను ఎటువంటి పాత్ర పోహిస్తున్నారో కూడా చెప్పేసారు.

urvashirautelafitness.jpg

ఇంతకీ ఆమె పాత్ర ఏంటి అనేది ఇంతవరకు కొంచెం సస్పెన్స్ గా వుండింది, కానీ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె పోషించే పాత్రని తన అభిమానులకి చెప్పేసారు. ఆమె ఈ సినిమాలో ఒక పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తున్నట్టుగా చెప్పారు, అందుకోసమని ప్రత్యేకంగా వ్యాయామం చేస్తున్నట్టుగా చెపుతూ, వ్యాయామం ఇచ్చే ట్రైనర్ తో ఒక ఫోటో కూడా పోస్ట్ చేశారు.

బాలీవుడ్ నటి అయినా ఊర్వశి రౌటేలా తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా తెలుసు. ఆమె స్పెషల్ పాటల్లో తన చిందులతో బాగా అలరించారు. ఇంతకు ముందు చిరంజీవి నటించిన 'వాల్తేర్ వీరయ్య' లో 'బాస్ పార్టీ' అనే పాటలో చిరంజీవితో డాన్స్ చేసి అందరినీ అలరించారు. ఆసక్తికరం ఏంటంటే ఆ సినిమాకి కూడా బాబీ కొల్లి దర్శకుడు, ఇప్పుడు ఆమెని బాలకృష్ణ సినిమాలో పాటలో కాకుండా ఒక ముఖ్యమైన పాత్రలో బాబీ తీసుకున్నారు. శ్రద్ధ శ్రీనాథ్ ఇంకో కథానాయికగా నటిస్తున్నారు, మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ ఒక ముఖ్య పాత్రలో కనపడనున్నారు.

Updated Date - Feb 01 , 2024 | 01:47 PM