NBK109: ‘యానిమల్’ స్టార్‌ని బాలయ్య మూవీ సెట్స్‌లోకి ఆహ్వానించిన ఊర్వశి..

ABN , Publish Date - Dec 30 , 2023 | 05:19 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రం సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించుకుంది. ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరుగుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా బాబీ డియోల్‌ను ఊర్వశి ఈ సినిమా సెట్స్‌లోకి ఆహ్వానించింది.

NBK109: ‘యానిమల్’ స్టార్‌ని బాలయ్య మూవీ సెట్స్‌లోకి ఆహ్వానించిన ఊర్వశి..
Urvashi Rautela and NBK109 Pic

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రం సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించుకుంది. ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరుగుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఆయన NBK109 సెట్స్‌కు హాజరయ్యారు. ఈ ‘యానిమల్’ (Animal) యాక్టర్‌కు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) సోషల్ మీడియా వేదికగా గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికింది.

డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఇంతకు ముందు వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’లో ఓ సాంగ్‌లో ఊర్వశి రౌతేలా సందడి చేయగా.. మళ్లీ ఆమెకు NBK109 చిత్రంలో బాబీ అవకాశం ఇచ్చారు. ఇందులో ఆమె కూడా ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ‘యానిమల్’ సినిమాతో మరోసారి తన సత్తా చాటిన బాబీ డియోల్.. ఈ చిత్రంలోనూ పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారు. ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ ఒకే ఫ్లైట్‌లో ఉన్న పిక్‌ని షేర్ చేసిన ఊర్వశి.. ‘‘NBK109 ఫిల్మ్ ఫ్యామిలీలోకి లార్డ్ బాబీ డియోల్‌ను ఆహ్వానిస్తున్నందుకు ఎంతో థ్రిల్ అవుతున్నాను. ఈ సినిమా ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన డియోల్ ఫ్యామిలీకి ఎప్పటికీ కృతజ్ఞురాలిని. బాబీ డియోల్‌ సార్‌.. NBK109లో మీతో కలిసి నటించే క్షణాల కోసం ఎంతో వెయిట్ చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్, ఆమె షేర్ చేసిన ఫొటోలతో NBK109 ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. (Urvashi Rautela Welcomes Bobby Deol)


Bobby-Deol.jpg

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయిన విషయం తెలియంది కాదు. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును ఈ పోస్టర్‌లో చూపించారు. ఈ గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనిస్తే.. ఈ సినిమా ఏ రేంజ్‌లో బాబీ ప్లాన్ చేశారో అర్థమవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Hi Nanna in OTT: ‘హాయ్ నాన్న’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

**************************

*Nagababu: కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి

**************************

*Rashmika Mandanna: ఎలా, ఎప్పుడు, ఎందుకు.. ఇదంతా జరిగింది? రష్మిక పోస్ట్ వైరల్

****************************

*King Nagarjuna: సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కింగ్ నాగ్

****************************

*Aamir Khan: ఆమిర్‌ఖాన్‌ కుమార్తె పెళ్లికి అంతా సిద్ధం.. గ్రాండ్ రిసెప్షన్ ఎక్కడంటే?

***************************

Updated Date - Dec 30 , 2023 | 05:19 PM